డీజే రివ్యూ: అల్లు అర్జున్ “దువ్వాడ జగన్నాధం (డీజే)”… హరీష్ శంకర్ మరోసారి హిట్ కొట్టారా..?

0
31


Movie Title (చిత్రం):  డీజే – దువ్వాడ జగన్నాధం (DJ- Duvvada Jagannadham)

Cast & Crew:

• నటీనటులు: అల్లు అర్జున్, పూజా హెగ్దె, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, తనికెళ్ళ భరణి, రావు రమేశ్ తదితరులు.
• సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
• నిర్మాత: దిల్ రాజు ( శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్)
• దర్శకత్వం: హరీష్ శంకర్. ఎస్

Story:

ఓ పాలెస్ లో వంట వాడిగా చేస్తుంటాడు బ్రాహ్మణుడు అయిన “దువ్వాడ జగన్నాధం”. అక్కడ జరిగే ఈవెంట్స్ అన్ని అతనే చూసుకుంటూ ఉంటాడు. అలా ఒక సందర్భంలో “పూజ హెగ్డే” ను కలుస్తాడు . ఆ అమ్మాయి ప్రేమలో పడిన తర్వాత అతని జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంది. ఇంతలో డీజే (అల్లు అర్జున్ డ్యూయల్ రోల్) తెరపైన కనిపిస్తాడు. అతను ఓ వెల్ఫేర్ కమ్యూనిటీ కి హెడ్. రియల్ ఎస్టేట్ లో జరుగుతున్న స్కాం పై పోరాడుతుంటాడు. న్యాయం కోరిన ప్రజలకు అండగా నిలుస్తాడు. అసలు డీజే కి దువ్వాడ జగన్నాధం కి సంబంధం ఏంటి..? పూజ హెగ్డే ప్రేమ కథ ఎలా ముగుస్తుంది? ల్యాండ్ మాఫియా చేసేది ఎవరు..? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలి అంటే దువ్వాడ జగన్నాధం సినిమా చూడాల్సిందే!

Review:

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన సినిమా “దువ్వాడ జగన్నాధం”. వరస హిట్లతో దూసుకెళ్తున్న అల్లు అర్జున్, హరీష్ శంకరులకు మరో హిట్ డీజే. అల్లు అర్జున్ ఆక్టింగ్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. గబ్బర్ సింగ్ స్టైల్ లోనే కామెడీ, మాస్ ఎంటర్టైన్మెంట్ కావాల్సిన రేంజ్ లో ఉన్నాయి డీజే లో. పంచ్ డైలాగ్స్ అయితే చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాను మరో ఎత్తుకి తీసుకెళ్లింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా బాగున్నాయి. అల్లు అర్జున్ అన్ని సినిమాల్లో లాగానే ఈ సినిమాలో కూడా డాన్స్ అదరగొట్టేసాడు. పూజ హెగ్డే తో కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. క్లైమాక్స్ లో ఉండే కామెడీ కి అయితే కడుపు చెక్కలు అయ్యేలా నవ్వుకుంటారు.

Plus Points:

• అల్లు అర్జున్ ఆక్టింగ్
• పూజ హెగ్డే గ్లామర్
• హీరో హీరోయిన్ కెమిస్ట్రీ
• దేవి శ్రీ ప్రసాద్ సంగీతం
• హరీష్ శంకర్ డైలాగ్స్
• క్లైమాక్స్
• కామెడీ

Minus Points:

• రొటీన్ స్టోరీ
• క్యారెక్టర్స్ ను సరిగా తెరకు ఎక్కించలేకపోయారు

Final Verdict:

కామెడీ, మాస్, క్లాస్, డాన్స్, రొమాన్స్ అన్ని కలిస్తే “డీజే”. సినిమా చూస్తునంత సేపు ఎంజాయ్ చేయడం పక్కా..!

Young Amaravati Rating: 3.5/5

Trailer:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here