ఆ గ్రామంలో ఉన్న గ్రామస్తులందరూ జనవరి 1నే పుట్టారట…!

0
23

రాజు తలచుకొంటే.. దెబ్బలకు కొదవా.. అంటే.. రాజు తలుచుకొంటే ఏమైనా చేస్తాడు అని అర్థం, అలాగే ఉన్నవాడు.. లేదా అధికారం ఉన్నవాడు తలుచు కుంటే కూడా ఎమైనా చేస్తాడు అన్న చందాన ఆ గ్రామంలో చిన్నా.. పెద్దా.. అనే తేడా లేకుండా అందరూ జనవరి 1 నే పుట్టారంట. అదేమిటి ఏదైనా విచిత్రం చోటు చేసుకొన్నదా.. లేకుండా ఊరు మొత్తం ఎలా జనవరి 1 న పుడతారు అని అనుకొంటున్నారా.. అక్కడ గ్రామస్తులంతా… ఆధార్ కార్డుల  ప్రకారం జనవరి ఒకటో తేదీనే జన్మించారు. ఈ వింత ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ గైండి ఖాటా గ్రామంలో చోటు చేసుకొన్నది.

ఈ గ్రామంలో దాదాపు 800 మంది కుటుంబాలు నివసిస్తున్నాయి.. వీరంతా ఐడీ, రేషన్ కార్డులను చూపించి ఓ ప్రైవేట్ ఏజన్సీ ద్వారా ఆధర్ కార్డులను తీసుకొన్నారు. కాగా మొత్తం గ్రామస్తులందరూ జనవరి 1 న పుట్టినట్లు ఆధర్ కార్డులో చూపిస్తున్నది. దీనిపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇలా ఆధర్ లో పుట్టిన తేదీలు తప్పులు రావడం ఇదే మొదటి సారి కాదు.. ఇప్పటికే రాజస్తాన్ లోని ఓ గ్రామంలో చాలా మంది జనవరి 1 న పుట్టినట్లు వచ్చింది.. ఇక అగ్రాలో కూడా మూడు గ్రామాల్లోని ప్రజలందరూ.. జనవరి 1 నే పుట్టినట్లు ఉన్నది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here