దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన జవాన్ కూతురు కన్నీళ్ళు గుండెలను రగిలించాయి.

0
30


దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అబ్దుల్ రషీద్ కుమార్తె జోహ్రా కన్నీళ్ళు మానవతావాదుల గుండెలను పిండుతున్నాయి. అబ్దుల్‌కు అంతిమ సంస్కారాల సమయంలో జోహ్రా ఏడుస్తున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చర్చనీయాంశమైంది. వందలు, వేల మంది ఆమెకు గుండె లోతుల నుంచి సానుభూతి తెలుపుతున్నారు.
అబ్దుల్ రషీద్ జమ్మూ-కశ్మీరు పోలీసు అధికారి. ఆయన అనంత్‌నాగ్ జిల్లాలోని మెహంది కదల్ వద్ద విధులు నిర్వహిస్తూండగా, ఉగ్రవాదుల కాల్పుల్లో అమరుడయ్యారు. దక్షిణ కశ్మీరు పోలీసు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా జోహ్రాకు సంఘీభావం ప్రకటించారు. ‘‘నీ కన్నీళ్ళు చాలామంది హృదయాలను కదిలించాయి. నీ తండ్రి చేసిన త్యాగాన్ని ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటాం. ఇలా ఎందుకు జరిగిందో అర్థం చేసుకోలేనంత చిన్నదానివి నువ్వు’’ అని పేర్కొన్నారు. ఇటువంటి హింసకు బాధ్యులైనవారు మానవత్వానికే శత్రువులని దుయ్యబట్టారు. ‘‘నీ ప్రతి కన్నీటి బొట్టు మా హృదయాన్ని రగిలిస్తోంది’’ అని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here