రూ.200 నోటు నేడు మార్కెట్‌లోకి అడుగు పెట్టబోతోంది. ఆ నోటు ఎలా ఉండబోతుందో తెలుసా.?

0
20

పసుపు వర్ణంలో మెరుస్తున్న రూ.200 నోటు నేడు (శుక్రవారం) మార్కెట్‌లోకి అడుగు పెట్టబోతోంది. దీని విడుదలకు ముహూర్తం ఖరారుచేస్తూ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) గురువారం ఓ ప్రకటన విడుదలచేసింది.

  • నోటు పైభాగంలో కొట్టొచ్చేలా మహాత్ముడి చిత్రాన్ని ముద్రించారు.
  • దృష్టి లోపాలున్నవారు సైతం గుర్తుపట్టేలా దీన్ని కాస్త ఉబ్బెత్తుగా సిద్ధంచేశారు.
  • అశోకుడి స్తంభం గుర్తునూ ఇలానే ముద్రించారు.
  • చిన్నచిన్న ‘‘రూ.200’’ అక్షరాలతో ‘‘హెచ్‌’’ మార్కునూ దీనిపై పెట్టారు.
  • కింది భాగంలో 200 రూపాయల గుర్తు (పచ్చ నుంచి నీలం రంగుకు మారే సిరాలో) ఉంటుంది.
  • నోటుపై వంపు తిరిగిన నాలుగు వర్ణాల గీతలు పారదర్శకంగా కనిపిస్తున్నాయి. వాటి మధ్య రెండు వలయాలు ఉన్నాయి.
  • 66 మి.మీ. పొడవు, 146 మి.మీ. వెడల్పున్న ఈ నోటు మధ్యభాగంలో పచ్చ నుంచి నీలం రంగులోకి మారే సిరాతో నిలువుగీత ఏర్పాటుచేశారు. దీనిపై భారత్‌, ఆర్‌బీఐ అని రాసివుంది.
  • భారత సంస్కృతీ వారసత్వానికి ప్రతీకగా సాంచి స్తూపం చిహ్నాన్ని వెనుకవైపు ముద్రించారు. దీనికి పక్కనే ‘స్వచ్ఛ భారత్‌’ నినాదం కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here