ఆజ్ఞాత‌వాసి ప్రీరిలీజ్ టాక్‌..?

0
187

గ‌త వారం రోజులుగా `ఆజ్ఞాత‌వాసి` ప్ర‌మోష‌న్ పీక్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ట్రైల‌ర్, ఆడియో రిలీజ్‌ నుంచే హీట్ రెట్టింపైంది. సెన్సార్ స‌హా అన్ని ఫార్మాలిటీస్ పూర్త‌య్యాయి. డిజిట‌ల్ ప్రింట్లు విదేశాల‌కు పంప‌డ‌మే ఆల‌స్యం. ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయిట‌. 9 జ‌న‌వ‌రి సాయంత్రం నుంచే ప్రీమియ‌ర్ల సందడి మొద‌లు కానుంది. ఇప్ప‌టికే ప‌వ‌న్ అభిమానుల్లో పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇంకో ఐదు రోజులే బాస్ ని థియేట‌ర్ల‌లో వీక్షించేందుకు స‌మ‌యం మిగిలి ఉంది కాబ‌ట్టి అభిమానుల్లో ఒక‌టే కోలాహాలంగా ఉంది.

ట్రైల‌ర్‌, పాట‌లు, అనిరుధ్ సంగీతం అందరికి న‌చ్చేశాయి. దీంతో టాలీవుడ్ ట్రేడ్‌లో పాజిటివ్ బజ్ మొద‌లైంది. ప‌వ‌న్ ఆల‌పించిన `కొడ‌కా కోటేశ్వ‌ర‌రావు..` సాంగ్ జ‌నంలోకి దూసుకెళ్లిపోయింది. ఈ పాట‌తో అంచ‌నాలు మ‌రింత‌గా రెట్టింప‌య్యాయి. అయితే ఇంత భారీ అంచ‌నాల న‌డుమ రిలీజ‌వుతున్న `ఆజ్ఞాత‌వాసి`కి సంబంధించి ఇన్‌సైడ్ టాక్ ఏంటి? అని వెతికితే యుఏఈకి చెందిన ప్ర‌ముఖ సినిమా జ‌ర్న‌లిస్ట్, క్రిటిక్ ఉమ‌ర్ సంధు నుంచి ఓ లీక్ అందింది.

“ఆజ్ఞాత‌వాసి `ఫ‌స్ట్‌కాపీ` చూశాక టాక్‌ బ‌య‌ట‌కు వ‌చ్చింది. రిపోర్ట్స్ ఔట్ స్టాండింగ్‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ షో ఆద్యంతం హృద‌యాల్ని దోచేశాడు. ఇది పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఇక వేచి చూడ‌లేను“ అంటూ ట్వీట్ చేశాడు ఉమ‌ర్ సంధు. ఈ ట్వీట్‌తో ఓవ‌ర్సీస్ ఫ్యాన్స్ స‌హా ఆడియెన్‌లో `ఆజ్ఞాత‌వాసి`పై మ‌రింత క్యూరియాసిటీ పెరిగింద‌నే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేస్తున్నారు. అలాగే అమెరికాలో క‌నీవినీ ఎరుగుని రీతిలో నైజాంని మించి రిలీజ్ చేస్తున్నారు. గ‌ల్ఫ్ దేశాల్లోనూ ఆజ్ఞాత‌వాసి హ‌వా కొన‌సాగ‌నుంది. విక్ట‌రీ వెంక‌టేష్ అతిధిగా, ఖుష్బూ కీల‌క‌పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేష్ క‌థానాయిక‌లుగా న‌టించిన సంగ‌తి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here