పట్టపగలు అందరూ చూస్తుండగా కిడ్నాప్ చేస్తున్న ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు సినిమా చూస్తునట్లు చూస్తూనే ఉన్నారు.

0
20

రద్దీ రోడ్డు వచ్చీపోయే వాహనాలతో బిజీగా ఉంది. ఇంతలో ఓ నడివయస్కుడైన వ్యక్తి స్కూటరుపై వచ్చి రోడ్డు పక్కనున్న షాపు వద్ద పార్కింగ్ చేశాడు. ఆ వెనకే ఓ తెల్లని కారు వచ్చి ఆగింది. ముగ్గురు యువకులు అందులోంచి వేగంగా కిందికి దిగారు.

నడి వయసు వ్యక్తిని బలంగా పట్టుకుని కారులోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. వారి చేతుల్లోంచి తప్పించుకునేందుకు అతడు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బలవంతంగా అతడిని కారు వెనక సీట్లోకి ఎక్కించారు. దుండగుల్లో ఒకడు అతడితో వెనక కూర్చున్నాడు. ఈ కిడ్నాప్ వ్యవహారం మొత్తాన్ని అందరూ విచిత్రంగా చూస్తున్నారు. కొందరైతే కారు వద్దకు వచ్చి ఏం జరుగుతుందో పరికించి చూశాడు.

ఇంకొందరు కారులోకి తొంగిచూశారు. అందరూ వింతగా గుమిగూడి సినిమా చూశారు తప్పితే ఒక్కరంటే ఒక్కరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు సరికదా.. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా ఎవరూ సాహించలేదు. ఈ మొత్తం ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. అక్కడి షాపు యజమానికి దానిని సోషల్ మీడియాలో పెట్టడంతో అది సంచలనంగా మారింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. కిడ్నాపైన వ్యక్తి ఓ చిరువ్యాపారని, అతడిది గుజరాత్‌లోని అహ్మదాబాద్ అని తెలిసింది.

Watch Video:LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here