అఖిల్ “హలో” స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో)..!

0
153

Movie Title (చిత్రం): హలో

Cast & Crew:

  • నటీనటులు: అఖిల్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ‌, అనీష్ కురువిల్లా, స‌త్య‌కృష్ణ‌, వెన్నెల‌కిషోర్‌, అజ‌య్, కృష్ణుడు త‌దిత‌రులు
  • సంగీతం: అనూప్ రూబెన్స్‌
  • నిర్మాత: అక్కినేని నాగార్జున‌
  • దర్శకత్వం: విక్ర‌మ్ కె.కుమార్‌

Story:

శీను(అఖిల్‌) అనాథ‌, త‌న‌కి జున్ను అలియాస్ ప్రియ (కల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌) అనే చిన్న‌ అమ్మాయి ప‌రిచ‌య‌మ‌వుతుంది. ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం చిగురిస్తుంది. అయితే జున్ను వాళ్ల తండ్రి (అనీష్ కురువిల్లా)కి ఢిల్లీ ట్రాన్స్‌ఫ‌ర్ కావ‌డంతో జున్ను ఢిల్లీ వెళ్లిపోతుంది. అలా వెళ్లే స‌మ‌యంలో జున్ను శీను వంద కాగితంపై నెంబ‌ర్ రాసిస్తుంది. ఆ వంత కాగితం ఎక్క‌డో పోతుంది. ఓ యాక్సిడెంట్ కారణంగా శీను.. ప్ర‌కాష్‌(జ‌గ‌ప‌తిబాబు), స‌రోజిని(ర‌మ్య‌కృష్ణ‌)ల‌కు ప‌రిచ‌యం అవుతాడు. వారు శీనుకి అవినాష్ అనే పేరు పెడ‌తారు. అవినాష్ పెరిగి పెద్ద‌యినా ప్ర‌తి రోజూ, జున్ను, త‌ను క‌లుసుకున్న జంక్ష‌న్ ద‌గ్గ‌ర‌కు వెళుతుంటాడు. ఓ రోజు అవినాష్‌కి ఓ క్యాబ్ డ్రైవ‌ర్ ఫోన్ చేస్తాడు. క్యాబ్ డ్రైవ‌ర్‌కి ద‌గ్గ‌ర‌లో వయోలిన్ ట్యూన్ విన‌ప‌డుతుంది. అది చిన్న‌ప్పుడు త‌ను జున్నుతో క‌లిసి ప్లే చేసిన ట్యూన్‌ని ప‌సిగ‌ట్టిన అవినాష్ ఆ ఆడ్ర‌స్ క‌నుక్కునే లోపు ఎవ‌రో త‌న ఫోన్ లాక్కుని పారిపోతారు. ఆ ఫోన్ కోసం, అందులోని నంబ‌ర్ కోసం అవినాష్ వారిని వెంబ‌డిస్తాడు. చివ‌రికి ఆ నెంబ‌ర్‌ను శీను అలియాస్ అవినాష్ తెలుసుకున్నాడా? అస‌లు జ‌న్నుని అవినాష్ ఎలా క‌లుసుకున్నాడు? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే…

Review:

అఖిల్ కి ల‌వ్ స్టోరీలు ఎక్కువ‌గా సూట్ అవుతాయ‌న్న‌ది కామ‌న్ ఫీలింగ్‌. హ‌లో`లో అత‌ను స్ట్రీట్ చైల్డ్ గా క‌నిపించాడు. అత‌న్ని చేరదీసిన మంచి జంట‌గా జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ‌, చిన్న‌త‌నాన్ని, స్నేహాన్ని మ‌ర్చిపోని రెండు హృద‌యాలుగా నాయికానాయ‌కులు.. సినిమా లో మెలోడీ ట్యూన్లు, మంద్రమైన సంగీతం చ‌క్క‌గా కుదిరాయి. స్క్రీన్ మీద అఖిల్‌ని చూస్తున్నంత సేపు అన్నీ చేసేయ‌గ‌ల‌డ‌నిపిస్తుంది. సెల్‌ఫోన్ల గోడౌన్‌, కొట్టేసిన సెల్‌ఫోన్ల‌ను ఒక చోటు నుంచి మ‌రో చోటుకి స‌ర‌ఫ‌రా చేసే తీరు వంటివాటి మీద చేసిన రీసెర్చ్ బావుంది. విల‌నీ లేకుండా ప‌రిస్థితుల‌నే విల‌నీగా చూప‌డం కూడా ఆక‌ట్ట‌కుంటుంది. కాలం మ‌రింత వేగ‌వంతంగా సాగుతున్న ఈ కాలంలో ఒక్క ఫోన్ నెంబర్‌ని ట్రేస్ చేయ‌లేక ఇబ్బందిప‌డే హీరో విష‌యం మాత్రం అంత తేలిగ్గా మింగుడుప‌డ‌దు. ఇలాంటి కొన్ని లాజిక్కుల‌ను ప‌క్క‌న‌పెట్టి, రెండు హృద‌యాలు ప‌డే ఆవేద‌న‌గా చూస్తే సినిమా బావున్న‌ట్టే.ఇక రాజ్‌పాల్ అనే లాయ‌ర్ పాత్ర‌లో సాయికుమార్ న‌ట‌న అద్వితీయం. త‌న‌దైన టైమింగ్‌తో సాయికుమార్ పాత్ర‌లో ఒదిగిపోయారు. ఇక జ‌డ్జ్ పాత్ర‌లో న‌టించిన శివ‌ప్ర‌సాద్ కూడా చాలా చ‌క్క‌గా చేశారు.

Plus Points:

అఖిల్ డ్యాన్సులు, ఫైట్లు

అనూప్ సంగీతం, పాట‌లు

హీరో హీరోయిన్ కెమిస్ట్రీ

ర‌మ్య‌కృష్ణ‌, జ‌గ‌ప‌తిబాబు

సినిమాటోగ్రఫీ

కథ, కథనం, దర్శకత్వం

Minus Points:

క‌థ‌లో కొత్త‌ద‌నం లేదు

 

Final Verdict:

“హ‌లో”.. ఫీల్ గుడ్ ల‌వ్ & యాక్ష‌న్ మూవీ

Young Amaravati Rating: 3.5 / 5

Trailer:

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here