రూ.129కే అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యత్వం! కానీ..

0
55

ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఆన్‌లైన్‌ వేదికగా అన్ని రకాల వస్తువులను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో పేరుతో ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ ద్వారా సినిమాలను, వెబ్‌ సిరీస్‌లను చూసే వెసులుబాటు కల్పిస్తోంది. అమెజాన్‌లో కొనుగోలు చేసిన వస్తువులు వేగంగా రావడం, ప్రైమ్‌ వీడియో ద్వారా సినిమాలను చూడాలంటే అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది. గతేడాది ప్రారంభ ఆఫర్‌ కింద రూ.499కే ప్రైమ్‌ సభ్యత్వాన్ని తీసుకురాగా, ఇప్పుడు రూ.129కే నెల రోజుల పాటు సభ్యత్వాన్ని పొందవచ్చు.

అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యత్వం ఉన్న వారు ఆ వెబ్‌సైట్‌ వేదికగా కొనుగోలు చేసే అనేక వస్తువులను ఉచితంగా అదే రోజున లేదా మరుసటి రోజు డెలివరీ చేస్తుంది. అంతేకాకుండా పలు సినిమాలను, వెబ్‌ సిరీస్‌లను, ప్రైమ్‌ మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు. ప్రస్తుతం ఏడాది కాలపరిమితి సభ్యత్వాన్ని రూ.999 అందిస్తున్న సంగతి తెలిసిందే. అంటే నెలకు రూ.83 ప్రైమ్‌ సౌకర్యాలను పొందవచ్చు. కానీ, ప్రస్తుతం నెల రోజుల కాలపరిమితి కావాలనుకునేవారు రూ.129 సభ్యత్వం పొందవచ్చు. అంటే ఏడాది సభ్యత్వ రుసుముతో పోలిస్తే, రూ.46 అదనంగా చెల్లించాల్సి వస్తుంది. కేవలం కొద్దిరోజులు మాత్రమే ప్రైమ్‌ సభ్యత్వం కావాలనుకునేవారికి ఇది ఉపయుక్తంగా ఉంటుందని అమెజాన్‌ చెబుతోంది.


Source:- EENADU

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here