కేసు పెడతానని తండ్రిని బెదిరించిన ‘అర్జున్‌రెడ్డి’ హీరోయిన్

0
45


యాంటీ పబ్లిసిటీ ఆ సినిమాకు ఎనలేని పేరు తెచ్చిపెట్టింది. సినిమానే కాదు.. అందులో నటించిన నటీనటులకు ప్రస్తుతం విపరీతమైన పబ్లిసిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమా హీరోయిన్ శాలిని పాండే తన మొదటి సినిమాతో చాలా పాపులర్ అయింది. కానీ ఇంతవరకు శాలిని పాండే బ్యాక్ గ్రౌండ్ ఏంటో పెద్దగా ఎవరికీ తెలియదు. తను ఎక్కడ చదివిందీ.. ఏం చదివిందీ.. తన పేరెంట్స్ ఎవరూ అనే విషయాలు పెద్దగా ప్రేక్షకులకు తెలియవు. కానీ ఇటీవల ఈ ముద్దుగుమ్మ ఓ షోలో తన ఫ్యామిలీ.. తన వివరాలన్నీ వెల్లడి చేసింది. శాలిని మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన యువతి. ఆమె తండ్రి ఒక గవర్నమెంట్ ఉద్యోగి.


శాలిని ఓ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ సినిమాలపై మక్కువ ఎక్కువ. కానీ ఆమె తండ్రికి మాత్రం సినిమాలంటే ఇష్టం లేదట. ఉద్యోగం చేయమంటే వినకుండా సినిమా అవకాశాల కోసం ప్రయత్నించిందట. తండ్రి ఆగ్రహిస్తే ఏకంగా ఆయనపై కేసు పెడతానని శాలిని బెదిరించిందట. దీంతో తల్లిదండ్రులు తనతో మాట్లాడటం మానేశారని.. అయినా అవకాశాల కోసం వేట ఆపలేదని తెలిపింది. చివరకు ఫ్రెండ్స్ సాయంతో అర్జున్‌రెడ్డి సినిమాలో అవకాశం పొందానని తెలిపింది.

ఇరుకు గదుల్లో ఉండటం ఇష్టం లేక నా స్నేహితురాలికి తెలిసిన ఇద్దరు అబ్బాయిలతో ఉండటానికి సిద్ధమయ్యాను. అప్పటికి ‘అర్జున్ రెడ్డి’ సినిమా సైన్ చేశాను. షూటింగ్ మొదలు కావడానికి ఇంకా సమయం ఉంది. 15 రోజులు అని చెప్పి పరిచయం లేని ఇద్దరు అబ్బాయిలతో 2 నెలలు ఒకే ఇంట్లో ఉన్నాను. వారు చాలా మంచి వారు. నా విషయంలో ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకోలేదు. నన్ను ఒక కిడ్ లా, ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేశారు అని శాలిని తెలిపారు.

Watch Video;

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here