చిరంజీవి 151వ సినిమా టైటిల్ లోగో ఇదే.

0
31


చాలా గ్యాప్ తర్వాత ఈ యేడాది ఖైదీ నంబర్ 150 మూవీతో జనానికి మరోసారి చేరువయ్యారు చిరంజీవి. 1983నుంచి ప్రేక్షక లోకం అభిమానం చూరగొంటూ వస్తున్నారు. చిరంజీవిగా ఇండస్ట్రీకి పరిచయమైన శివశంకర వరప్రసాద్ నేటికీ తిరుగులేని స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.

ఇటీవలే చిరు తన 151వ సినిమా పూజకార్యక్రమాలు నిర్వహించారు. దేశభక్తుని జీవితగాథతో ఈ మూవీ తెరకెక్కబోతోంది. ఇవాళ ఆయన 63వ పుట్టినరోజు వేడుకలు వైభవంగా నిర్వహించారు. చిరు బర్త్‌డే సందర్భంగా కొణిదల ప్రొడక్షన్స్ 151వ సినిమా టైటిల్ లోగోను, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది.

చిరు 151వ సినిమాకు సంబంధించిన ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని తాజాగా సైరా అనే టైటిల్.. తెరపైకి వచ్చింది. చివరకు సస్పెన్స్‌కు తెరదించుతూ చిత్ర యూనిట్ టైటిల్‌ పోస్టర్‌ను, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. చిరు మూవీ టైటిల్ సైరా నరసింహారెడ్డి.

Watch Videos:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here