జ్వరంతో బాధపడుతున్న కుమారుడిని సర్కారు ఆసుపత్రికి తీసుకెళ్లిన కలెక్టరు..!

0
24

సాక్షాత్తూ జిల్లా కలెక్టరు తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తన కుమారుడిని వైద్యచికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లిన అరుదైన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో వెలుగుచూసింది. సేలం జిల్లా కలెక్టరుగా రోహిణి పనిచేస్తున్నారు. తన కుమారుడు తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో అతన్ని నేరుగా తీసుకొని సేలం పట్టణంలోని మోహన్ కుమారమంగళం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పట్టణంలో గత కొంత కాలంగా డెంగీ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో కలెక్టరు తన కుమారుడికి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి అక్కడ రక్తపరీక్షలు చేయించారు.

ఈ ఘటనతో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచిందని స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పారు. కలెక్టరు తీసుకున్న చర్యలను ప్రజలు అభినందించారు. కలెక్టరు కుమారుడికి రక్తపరీక్షల్లో డెంగీ నెగిటివ్ అని వచ్చింది. మొత్తంమీద సేలం పట్టణంలో డెంగీ వ్యాధిని శాశ్వతంగా నివారించే దాకా తాను విశ్రమించనని కలెక్టరు రోహిణి ప్రకటించారు. పట్టణంలో డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పారిశుద్ధ్యం మెరుగుతోపాటు డెంగీ నివారణ చర్యలను కలెక్టరు రోహిణి తీసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here