అసలు బ్యాంక్ ఖాతా తెరవాలంటే.. ఎంత కర్చు అవుతుందో తెలుసా?

0
23

సాధారణంగా బ్యాంకు ఖాతా తెరవాలంటే ఏం చేయాలి..? బ్యాంకుకెళ్లి సదరు బ్యాంకు అందించే ఖాతాలపై విచారణ చేస్తాం. తర్వాత సంబంధిత పత్రాలు సమర్పించి డాక్యుమెంట్స్ తీసుకుంటాం. మరి దీనంతటికీ ఎంత ఖర్చవుతుందో తెలుసా..? దీనికి ఖర్చేముంటుంది.!! పొదుపు, కరెంట్ ఖాతాలైతే బ్యాంకులను బట్టి ఎంతో కొంత డిపాజిట్ చేస్తాం. ఇక జీరో బ్యాలెన్స్ అయితే అది కూడా అవసరం ఉండదనుకుంటున్నారు కదా..

కానీ.. ప్రాథమికంగా బ్యాంకులో ఒక ఖాతా తెరవాలంటే అక్షరాల రూ.139 ఖర్చవుతుందట. ఈ మేరకు ఆర్బీఐ తన నివేదికలో పేర్కొంది. 2016లో బ్యాంకుల ఆడిట్ను పరిశీలించిన అనంతరం ఆర్బీఐ ఓ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం ప్రాథమికంగా ఓ బ్యాంకు ఖాతా తెరవాలంటే సగటున రూ.139 ఖర్చవుతుందని పేర్కొంది. డాక్యుమెంటేషన్ ఖర్చులతో పాటు బ్యాంకుకు వెళ్లి వచ్చేందుకు ప్రయాణ ఖర్చులు కూడా అవుతాయని ఆర్బీఐ నివేదికలో తెలిపింది. నగదు మాత్రమే కాదండోయ్ ఖాతా తెరవాలంటే సమయం కూడా వెచ్చించాల్సిందే. సగటున 7.28 గంటల సమయం పడుతుందని ఆర్బీఐ పేర్కొంది.అయితే ఈ ఖర్చులు తగ్గాలంటే బ్యాంకుల్లో సాంకేతికత పెరగాలంటోంది ఆర్బీఐ. ఆధార్, మొబైల్ ఫోన్ లాంటివి ప్రతి ఒక్కరి వద్దకూ చేరితే బ్యాంకింగ్ ఖర్చులు తగ్గుతాయని పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here