ఆమె వేసుకున్న షూస్‌ ఖరీదు ఎంతో తెలుసా..?

0
51

బాలీవుడ్‌ స్టార్‌ కిడ్స్‌కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌, సైఫ్‌ కూతురు సరా అలీఖాన్‌ ఎప్పుడు మీడియాకు కనిపించినా ఫ్యాషన్‌ ప్రపంచంలో అదొక సంచలనమే. అంతగా తమ ఫ్యాషన్‌తో, స్టైల్‌తో ఆకట్టుకోవడం ఈ టీనేజ్‌ గర్ల్స్‌ ప్రత్యేకత. ఇక ఈ లిస్ట్‌లోకే వస్తారు షారుఖ్‌ ఖాన్‌ కూతురు సుహానా.. లెటెస్ట్‌ స్టైల్‌ ఫాలో కావడంలో.. పాపులారిటీలో తను ఇతర సెలబ్రిటీ కిడ్స్‌కు ఏమాతం తీసిపోదు.

తాజాగా ఈ టీనేజ్‌ బ్యూటీ దీపావళి సందర్భంగా ముంబైలో సందడి చేసింది. తన స్నేహితులు ఆహనా పాండే, షనాయ కపూర్‌తో కలిసి ఎంజాయ్‌ చేస్తుండగా కెమెరా కంటికి చిక్కింది. ప్లెయిన్‌ వైట్‌ స్లీవ్‌లెస్‌ టీ, రిపెడ్‌ జీన్స్‌ వేసుకున్న ఈ అమ్మడు చూపరుల దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా సుహానా వేసుకున్న స్నీకర్స్‌ (షూస్‌) అందరి దృష్టి ఆకర్షించాయి. గ్యిసెప్‌ జానొట్టి కంపెనీకి చెందిన ‘జెన్నిఫర్‌’ వెడ్జ్‌ స్నీకర్స్‌ ధర ఎంతో తెలుసా.. అక్షరాల 995 డాలర్లు. అంటే రూ. 64వేలు అన్నమాట. ఈ మొత్తం డబ్బుంటే ఒకసారి హాయిగా థాయ్‌లాండ్‌ పర్యటనకు వెళ్లిరావొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here