ఒక‌ప్పుడు ఆమె నాన్న.. ఓ టీ కొట్టు ఓనర్.. ఇప్పుడు ఆయన కూతురు పేరు గాంచిన క్రికెట‌ర్ తెలుసా..!

0
22


ఏక్తా బిష్ఠ్‌. ఇప్పుడు పురుష క్రికెటర్లతో సమానంగా వినిపిస్తున్న పేరిది. మహిళల ప్రపంచకప్‌లో మొన్న తన ఎడమచేతి వాటం స్పిన్‌మాయాజాలంతో పాకిస్థాన్‌ను బెంబేలెత్తించి భారత్‌ను విజయంపథంలో నడిపించాక ఏక్తా స్టార్‌ అయిపోయింది. క్రికెట్‌ అభిమానులను తనవేపు తిప్పుకుంది.

కానీ ఎవరరికీ తెలియని విషయమేంటంటే ఏక్తా కలలను నెరవేర్చడం కోసం మాజీ సైనికోద్యోగి అయిన ఆమె తండ్రి చాయ్‌వాలాగా మారిపోయాడు.

కుంద‌న్ సింగ్ బిష్త్ ఆర్మీలో హ‌వీల్దార్‌గా ప‌నిచేసేవాడు. భారత సైన్యం నుంచి రిటైరయ్యాక వచ్చే పెన్షన్‌ 1500 స‌రిపోయేదికాదు. రూ.1500 ఏమాత్రం సరిపోకపోవడంతో ఏక్తా తండ్రి కుందన్‌ తన కుటుంబం కోసం టీ దుకాణం పెట్టాడు.

కుందన్‌కు ఏక్తాతో పాటు మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో ఆయన దుకాణం నడిపేవాడు.
ఏక్తా బిష్త్ ది చాలా పేద కుటుంబం.

వారు ఉత్త‌రాఖండ్‌లోని అల్మోరా అనే ప్రాంతంలో నివాసం ఉండే వారు. అయితే ఏక్తాకు చిన్న‌ప్ప‌టి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. తాను 6 సంవత్స‌రాల వ‌య‌స్సు నుంచే క్రికెట్ ఆడ‌డం మొద‌లు పెట్టింది.

త‌మ చుట్టు ప‌క్క‌ల ఉండే బాలుర‌తో ఆమె ఒక్క‌తే క్రికెట్ ఆడేది. టీం మొత్తంలో బాలిక ఆమె ఒక్క‌తే కావ‌డం విశేషం. అయిన‌ప్ప‌టికీ తండ్రి కుంద‌న్ సింగ్ బిష్త్ ఆమెను వ‌ద్ద‌ని అనే వాడు కాదు. ఆడ‌మ‌నే ప్రోత్స‌హించేవాడు.

ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డా ఏక్తాకు పూర్తిగా అండగా నిలిచాం. ఆమె ఎంతో బాధ్యతాయుతంగా ఉంటుంది. అప్పట్లో ట్రయల్స్‌ సందర్భంగా మేమిచ్చే డబ్బును చాలా పొదుపుగా వాడుకునేది’’ అని ఏక్తా తల్లి వివరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here