ఠాగూర్ సీన్ రిపీట్… డెంగ్యూ తో చిన్నారి మృతి.. అయినా రూ.18 లక్షల బిల్లు

0
28

సేమ టు సేమ్ ఠాగూర్ సినిమాలోని సీన్ అది. 15 రోజులపాటు పాపకు ట్రీట్‌ మెంట్ ఇచ్చారు. 18 లక్షల బిల్ వేశారు. అయినా పాప బతకలేదు. బిల్లు కడితేగానీ డెడ్‌ బాడీ అప్పగించలేదు. దారుణం ఏంటంటే డాక్టర్లు వాడిన గ్లౌజులకు కూడా బిల్లు వేశారు. ఈ దుర్మార్గం గురుగ్రామ్‌లోని ఫోర్టీస్ అనే కార్పోరేట్ హాస్పిటల్‌ది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేంద్రం స్పందించింది. వెంటనే నివేదికకు ఆదేశించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా. బాధ్యులపై యాక్షన్ తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

ఢిల్లీలోని ద్వారక ప్రాంతానికి చెందిన జయంత్ సింగ్ ఏడేళ్ల కూతురు ఆద్యకు డెంగీ సోకింది. ఆగస్టు 31న ఆ పాపను ఫోర్టీస్ హాస్పిటల్‌లో చేర్చారు. డాక్టర్లు ఆమెకు 15 రోజులపాటు ట్రీట్‌మెంట్‌ ఇచ్చినా ఆరోగ్యం మెరుగుపడలేదు. చివరికి సెప్టెంబర్ 14న ఆద్య మరణించింది. పాప చనిపోయిందనే కనికరం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు బిల్లు వేశారు ఆ దుర్మార్గ సిబ్బంది. సిరంజీలు, చివరికి డాక్టర్లు వాడిన 2700 గ్లౌజులకూ బిల్లు వేశారు. మొత్తంగా 18 లక్షల రూపాయల బిల్లువేసి అది కడితేగానీ పాప డెడ్ బాడీ అప్పగించబోమంటూ భీష్మించుకుని కూర్చున్నారు. కూతురుని కోల్పోయిన అంతులేని విషాదంలోనూ చేసేదేమీ లేక 18 లక్షలు చెల్లించి డెడ్‌ బాడీని తీసుకెళ్లారు తల్లిదండ్రులు.

ఈ విషయం జయంత్ ఫ్రెండ్ ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ట్వీట్ వైరల్ అయింది. నెటిజన్లు ఫోర్టీస్ ఆసుపత్రి యాజమాన్యం తీరుపై మండిపడుతున్నారు. యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకే దీనిపై కేంద్రం స్పందించింది. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా హామీ ఇచ్చారు. మరి ఇది ఎంతవరకు నెరవేరుతుందనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here