కోపంతో యువతి ప్రియుడిపై ఎలా పగతీర్చుకుందో చూడండి.

0
54

ప్రేమించానన్నాడు.. బిజినెస్‌ పరంగా సాయం కూడా చేస్తానన్నాడు. ఏమైందో ఏమో కానీ ప్రేయసిని డిన్నర్‌కు తీసుకెళ్లి ఆమెతో అక్కడికక్కడే తెగదెంపులు చేసుకుని వెళ్లిపోయాడు. కోపంతో ఆ యువతి ప్రియుడిపై ఎలా పగతీర్చుకుందో చూడండి.

రష్యాకి చెందిన గయ్‌ జెంటిల్‌ అనే వ్యక్తి బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి కొన్ని రోజుల క్రితం క్రిస్టినా అనే మోడల్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. గయ్‌ బ్యాంక్‌ ఉద్యోగి కాబట్టి క్రిస్టినాకు వ్యాపారం ప్రారంభించడానికి లోను ఇప్పిస్తానని మాటిచ్చాడు.

గత వారం ఇద్దరూ డిన్నర్‌ నిమిత్తం ఓ హోటల్‌కు వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో తెలీదు కానీ గయ్‌.. క్రిస్టినాను హోటల్‌ దగ్గరే వదిలేసి వెళ్లిపోయాడు. దాంతో అతనిపై పగ తీర్చుకోవాలనుకుంది క్రిస్టినా. వెంటనే గయ్‌ నివసిస్తున్న ఇంట్లోకి చొరబడి అతని మెర్సిడెస్‌ ఎస్‌400 కారును స్విమ్మింగ్‌ పూల్‌లోకి నెట్టేసింది. పైగా ‘నీకు కావాల్సిన సర్‌ప్రైజ్‌ మీ ఇంటి వెనకే ఉంది.’ అని ఓ కాగితంపై రాసి అతని ఇంటి ముందు పెట్టి వెళ్లిపోయింది.

అయితే కారు నీటిలో మునిగిపోయినందుకు గయ్‌ బాధపడలేదు. అందులో క్రిస్టినా కూడా ఉందేమోనని భయపడ్డాడట. ఆ తర్వాత ఆమె లేదని తెలుసుకుని వూపిరిపీల్చుకున్నాడు. ఏదేమైనా క్రిస్టినాను తాను వదిలించుకోగలిగానని రిలాక్స్‌గా చెప్తున్నాడు గయ్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here