దిగివస్తున్న బంగారం ధర…!

0
27

కొద్ది రోజుల క్రితం పైపైకి ఎగబాకిన బంగారం ధర ఇప్పుడు రోజురోజుకీ దిగివస్తోంది. స్టాక్ మార్కెట్లు జోరుమీద ఉండడం అంతర్జాతీయ పరిస్థితులే ఇందుకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశీయ డిమాండ్ కూడా 50 శాతానికి పైగా తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. శుభకార్యాల సీజన్‌ ముగియడంతో పాటు మూఢం ప్రారంభం కావడంతో కొన్ని నెలల పాటు బంగారం ధర కిందిచూపులే చూస్తుందని అంటున్నారు విశ్లేషకులు.

బంగారంతో భారతీయులకు ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు ఇళ్లలో ఏ శుభకార్యం జరగాలన్నా బంగారం ఉండాల్సిందే. చాలా మంది గిఫ్ట్‌లుగా కూడా బంగారం కొంటుంటారు. ఇక ధన్‌ తేరస్ లాంటి సమయాల్లో ఒక్క గ్రామైన బంగారం కొంటే మంచిదని చాలా మంది భావిస్తారు. అందుకే ఇండియాలో గోల్డ్ డిమాండ్ తగ్గదని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు కూడా తేల్చి చెప్పాయి. కానీ, మనదేశంలో కూడా అప్పుడప్పుడు బంగారానికి ఆక్సిజన్ వస్తుంటుంది. ఇప్పుడు కూడా సరిగ్గా అలాంటి టైమే వచ్చింది. నవంబర్ చివరి వారంలో మూడు రోజుల పాటు వేలాది పెళ్లిళ్లు జరిగాయి. దీంతో బంగారం ఒక్కసారిగా పెరిగిపోయింది. డిమాండ్ భారీగా పెరగడంతో వ్యాపారులు కూడా రేట్లు భారీగా పెంచేశారు. అయితే పెళ్లిళ్ల సీజన్ నవంబర్ 30తో ముగిసింది ఆ తర్వాత మూఢం వచ్చింది. మళ్లీ ఫిబ్రవరి వరకు మంచి మూహూర్తాలు లేవని చెబుతున్నారు. అందుకే ధర రోజూ తగ్గుతూ వస్తోంది. గత 12 రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర రూ.1500 తగ్గిందంటే గోల్డ్ రేట్ ఎంత తగ్గుతుందో తెలుసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here