అలా చెప్పి అమ్మాయిలను వలలో వేసుకుంటారు – హీరోయిన్ సంజన

0
616

బుజ్జిగాడు సినిమాతో టాలీవుడ్‌ తెరపై పరిచయమై మంచి పాపులారిటీ సంపాదించుకుంది సంజన. కన్నడ, మలయాళంతో పాటు తెలుగులో కూడామంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ దండుపాళ్యం మూవీలో కీలక రోల్ పోషించింది. స్వర్ణ ఖడ్గం సీరియల్‌తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి ప్రతి ఇంటీకీ పరచయమైంది ఈ భామ.

ఇటీవల ఓ ఇంటర్వూలో క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించిన సంజన.. ‘నిరాశలో కూరుకుపోయి, ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్న అమ్మాయిలనే కొందరూ లోబరుచుకుంటారు. ‘నేను ఆ సినిమాకు ప్రొడ్యూసర్‌ని, ఈ మూవీ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ని, ఫైనాన్షియర్‌ని’ అని చెప్పి అమ్మాయిలను వలలో వేసుకుంటారు. ఇలాంటి వారి విషయంలో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని చెప్పుకొచ్చింది సంజన.

Source:- TV5NEWS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here