ప్రయాణాల్లో వాంతులు కాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాలి.

0
28


చాలామందికి బస్సు, కారు ప్రయాణాలు పడవు. జర్నీ చేసేప్పుడు వికారంగా, కడుపులో తిప్పినట్టుగా ఉంటుంది. దాని ఫలితంగా వామిటింగ్ కూడా అవుతుంది. ఎక్కువగా తిరుమలకు లేదంటే ఏదన్నా ఘాట్ రోడ్స్ లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఇలా చాలామందికి వాహన ప్రయాణాల సమయంలో వాంతులు అవుతుంటాయి. అలాంటివారు ప్రయాణానికి ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్యనుండి ఈజీగా బయటపడొచ్చు. ఆ సంగతులేమిటో కింద తెలుసుకుని ఇక నుంచి ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకుని హ్యాపీ జర్నీకి ప్రయత్నం చేద్దాం.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • చిన్న అల్లం ముక్కను బుగ్గన పెట్టుకుంటే వాంతి వచ్చే అవకాశం తగ్గుతుంది.
  • అల్లంలో ఉండే క్యాల్షియం, పాస్ఫరస్‌, ఐరన్‌, మెగ్నీషియం, కాపర్‌, జింక్‌ వంటివి మన శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలు.
  • వక్కపొడి లాంటిది చప్పరిస్తున్న కూడా ఈ ఫీలింగ్ నుండి బయటపడొచ్చు.
  • నిమ్మకాయను ముక్కు దగ్గర పెట్టుకుని వాసన పీలుస్తుంటే కూడా ఈ సమస్య ను తగ్గించుకోవచ్చు.
  • లవంగాలు,సోంపు లాంటివి కూడా దవడకు పెట్టుకుని చప్పరిస్తున్న కూడా వాంటింగ్ సెన్సేషన్ తగ్గుతుంది.
  • మరీ ముఖ్యంగా బస్ లో కానీ ,కార్లో కానీ ప్రయాణించేప్పుడు ముందు సీట్లో కూర్చుని మన దృష్టి కూడా స్ట్రెయిట్ గా చూసినట్టయితే వామిటింగ్ సెన్సేషన్ నుండి తప్పించుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here