సినీనటితో స్వామీజీ కుమారుడి రాసలీలలు..!

0
33

డేరాబాబా రాసలీలలు మరువకముందే బెంగళూరులో ఓ స్వామీజీ కుమారుడి బాగోతం వెలుగులోకి వచ్చింది. యలహంకలోని హుణసేమారేనహళ్ళి మఠాధిపతి పర్వతరాజు కుమారుడు దయానంద అలియాస్‌ నంజేశ్వర శివాచార్య రాసలీలల వీడియోలు గురువారం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. దీంతో దయానందతో పాటు సినీనటిఅజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 500ఏళ్ల చరిత్రకలిగిన హుణసేమారేనహళ్ళి మఠానికి మంచిపేరుంది. కొన్నేళ్లుగా పర్వతరాజ శివాచార్య పీఠాధిపతిగా కొనసాగుతున్నారు. ఆయన రెండో భార్య కుమారుడైన దయానంద పదో తరగతిలో డీబారై, జులాయిగా తిరుగుతున్నాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన అతడిని 2011లో పీఠాధిపతిగా చేసేందుకు పర్వతరాజు ప్రయత్నించారు. అయితే ట్రస్టు సభ్యుల వ్యతిరేకించడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు.

ఇటీవల పర్వతరాజు అనారోగ్యానికి గురికావడంతో మఠంలో దయానంద అంతా తానై వ్యవహరిస్తున్నారు. ఆయనకు పలువురు ట్రస్టుసభ్యులు, మఠం ఉద్యోగులు మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మఠంలోనే విలాసవంతమైన జీవితాన్ని ప్రారంభించారు.3ప్రముఖ కన్నడ సినిమాల్లో నటించిన తారతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయని, ఆమె నటించే 4వ సినిమాకు నిధులు సమకూర్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మఠంలోని ఓ గదిలో ఆమెతో దయానంద రాసలీలలు జరిపిన దృశ్యాలు బయటకు వచ్చాయి. వీడియోల విడుదల వెనుక సదరునటి హస్తముందనే ప్రచారం జరుగుతోంది. భక్తిభావంతోసాగుతున్న మఠాన్ని పర్వతరాజు పీఠాధిపతిగా ఎన్నికయ్యాక కుటుంబమఠంగా మార్చేశారు. ఇరువురు భార్యలతో కలిసి ఆయనఅక్కడే నివసిస్తున్నారు. దయానంద రాసలీలలు బహిర్గతం కావడంపై భక్తుల్లో ఆగ్రహం పెల్లుబికింది. దీంతో మఠం దగ్గర భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here