క్రేజీ రోమియో! ప్రియురాలికి 25 ఐఫోన్10లను బహూకరించాడు…

0
34

ఓ క్రేజీ రోమియో తన ప్రియురాలిని పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించేందుకు ఏకంగా 25 ఐ ఫోన్ 10లను బహూకరించి ఆశ్చర్యంలో ముంచెత్తిన అరుదైన ఘటన చైనా దేశంలో జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిమంది కొత్తగా విడుదలైన ఐఫోన్ 10 కోసం ఎదురుచూస్తుండగా చైనా దేశానికి చెందిన గేమ్ డిజైనర్ షెన్ జెన్ అనే యువకుడు తన ప్రియురాలికి ఏకంగా 25 ఐ ఫోన్లను బహుమతిగా అందించి క్రేజీ రోమియోగా అందరి దృష్టిని ఆకర్షించాడు. రూ.25.5 లక్షల విలువ చేసే 25 ఐ ఫోన్ 10లను ప్రేమ చిహ్నమైన గుండె ఆకారంలో పెట్టి దానిలో గులాబీ పూలు పెట్టి మధ్యలో నిశ్చితార్థం రింగ్ ఉంచాడు.

తన ప్రియురాలిని ఆకట్టుకోవడానికి రూ. 25.5 లక్షలు వెచ్చించి ఐ ఫోన్లను కొన్న సంఘటన చైనా దేశంలో చర్చనీయాంశంగా మారింది. తన కాబోయే భర్త అత్యంత ఖరీదైన ఐ ఫోన్లను బహుమతిగా ఇవ్వడంతో ప్రియురాలు కాస్తా అతని విశాల హృదయానికి ఫిదా అయిపోయి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.దీంతో స్నేహితుల సమక్షంలోనే తన ప్రేయసిపై షెన్ జెన్ ముద్దుల వర్షం కురిపించాడు. తన ప్రేయసి ప్రేమను పొందడంలో తనకు సహకరించిన తన స్నేహితులకు కూడా ఐఫోన్ 10లను బహుమతిగా ఇవ్వాలని షెన్ జెన్ నిర్ణయించడం మరో కొసమెరుపు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here