ఐపీఎల్‌ లీగ్‌ మధ్యలో ఎప్పుడైనా ఆటగాళ్లు అటు ఇటు మారొచ్చు… షరతు ఏమిటంటే.?

0
25

అధిక సొమ్ము వెచ్చించి ఆటగాళ్లను కొనడం తీరా లీగ్‌ ఆరంభమయ్యాక కూర్పు కుదరక స్టార్‌ క్రికెటర్లను బెంచ్‌కు పరిమితం చేయడం.. ఐపీఎల్‌లో ఎప్పుడూ కనిపించే దృశ్యమే ఇది ఈ సమస్యకు పరిష్కారం చూపే ఓ వినూత్న ఆలోచన తెరపైకి వచ్చింది. లీగ్‌ తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం దక్కని క్రికెటర్లను ఇతర జట్లకు అమ్మేసే అవకాశాన్ని ఫ్రాంఛైజీలకు ఇవ్వాలన్నది ప్రతిపాదన. ఇలా చేయడం వల్ల ఆటగాడితో పాటు ఫ్రాంఛైజీలకు లాభమే! ఫ్రాంఛైజీలు కొంతమేర నష్టాన్ని తగ్గించుకోవచ్చు.

మరోవైపు ఆటగాడికి ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తుంది. ఐపీఎల్‌ అధికారులు, ఫ్రాంఛైజీ యజమానుల మధ్య జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదన చర్చకు వచ్చింది. అన్ని ఫ్రాంఛైజీలు ఆసక్తి ప్రదర్శించాయని సమాచారం. ఐపీఎల్‌ పాలక మండలి ఆమోదం లభిస్తే ఈ ప్రతిపాదన అమలుపై విధివిధానాలు రూపొందిస్తారని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. లీగ్‌ మధ్యలో ఓ జట్టులోని ఆటగాడిని మరో జట్టు కొనుగోలు చేయడం గతంలో ఎప్పుడూ జరగలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here