సాయి ధరమ్ తేజ్ “జవాన్” స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో)..!

0
89

Movie Title (చిత్రం): జవాన్ (jawaan)

Cast & Crew:

  • నటీనటులు: సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్, ప్రసన్న తదితరులు.
  • సంగీతం: తమన్ ఎస్
  • నిర్మాత: కృష్ణ
  • దర్శకత్వం: బి వి ఎస్ రవి

Story:

జై(సాయిధ‌ర‌మ్ తేజ్‌), కేశ‌వ‌(ప్ర‌స‌న్న‌)లు చిన్న‌ప్పుడు స్నేహితులు. చిన్న‌ప్పుడే ఇద్ద‌రు విడిపోతారు. చిన్న‌ప్ప‌టి నుండి కేశ‌వ హింస‌ను, స్వార్ధాన్ని న‌మ్ముకుని దేశానికి చెడు చేయాల‌నుకునే తీవ్ర‌వాద సంస్థ‌ల‌తో చేతులు క‌లుపుతాడు. జై చిన్న‌ప్ప‌టి నుండి ఆర్‌.ఎస్‌.ఎస్‌. స‌భ్యుడు కావ‌డం..తండ్రి బాధ్య‌త గ‌ల ఉపాధ్యాయుడిగా ఉండ‌టం వంటి కార‌ణాల‌తో దేశ భ‌క్తుడిగా ఎదుగుతాడు. కానీ కేశ‌వ దేశ ద్రోహి అనే విష‌యం జై తెలియ‌దు. దేశ ర‌క్ష‌ణ సంస్థ‌ల్లో ఒక‌టైన డి.ఆర్‌.డి.ఒ సంస్థ‌లో ఎలాగైనా ఉద్యోగం సంపాదించాల‌నే క‌ల‌తో ఉంటాడు జై. క‌థ ఇలా సాగే క్ర‌మంలో..దేశ ర‌క్ష‌ణ కోసం డి.ఆర్‌.డి.ఒ. అక్టోప‌స్ అనే మిసైల్‌ను త‌యారు చేస్తుంది. ఈ మిసైల్‌ను సొంతం చేసుకుని ఇండియాను భ‌య‌పెట్టాల‌ని శ‌త్రుదేశాలు ప్ర‌య‌త్నిస్తాయి. ఆ మిసైల్‌ను దొంగ‌లించే డీల్‌ను కేశ‌వ‌కు అప్పగిస్తారు. అయితే స్టాంపుల‌ను త‌యారు చేసే వ్య‌క్తి(కోట శ్రీనివాస‌రావు) వ‌ల్ల డి.ఆర్‌.డి.ఒకి సంబంధించి ఏదో జ‌రుగుతుంద‌ని జైకి తెలుస్తుంది. జై వేసే ఓ ప్లాన్ వ‌ల్ల అసలు విష‌యం తెలుస్తుంది. దాంతో దేశానికి చెడు చేయాల‌నుకునే కేశ‌వ ఆలోచ‌న‌కి బ్రేక్ వేస్తాడు జై దీంతో జై, కేశ‌వ‌ల మ‌ధ్య మైండ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. కేశ‌వ ఓ స్నేహితుడిలా..జై ఇంటికి వ‌చ్చి ..త‌న కుటంబాన్ని ఇబ్బందుల‌కు గురి చేస్తాడు. చివ‌ర‌కు జై త‌న కుటుంబాన్ని, దేశాన్ని ఎలా కాపాడుకున్నాడ‌నేదే? అస‌లు క‌థ‌.

Review:

ఇద్దరు బలమైన, తెలివైన వాళ్ల మధ్య సాగే మైండ్‌ గేమ్‌ కాన్సెప్ట్‌ ఇది. ఒకరికి దేశభక్తి ఉంటే.. ఇంకొకరు తన స్వార్థం కోసం దేశానికి ద్రోహం చేయాలని చూసే వ్యక్తి. ఇది ఒక స్క్రీన్‌ప్లే బేస్డ్‌ కథ. ఒకరిపై ఒకరు వేసుకునే ఎత్తులు.. పై ఎత్తులు ఆసక్తికరంగా ఉంటాయి.ఈ కథలో ఆ అవకాశం దక్కింది. హీరో-విలన్ల మధ్య జరిగే సన్నివేశాలు ఈ కథకు బలం. వాటిని దర్శకుడు చక్కగా రాసుకొన్నాడు.సాధారణంగా కథానాయకుడు.. ప్రతినాయకుడి ఇంట్లోకి వెళ్లి అక్కడి నుంచి కథను నడిపిస్తుంటాడు. కానీ, అందుకు భిన్నంగా ఇందులో కథానాయకుడి ఇంట్లోకి ప్రతినాయకుడు వచ్చి చేరతాడు. శత్రువు ఇంట్లో ఉన్నా సరే అతని గురించి తెలుసుకోవడానికి పోరాడుతుంటాడు కథానాయకుడు. వాటికి సంబంధించిన సన్నివేశాల్లో లాజిక్‌ ఎక్కడా మిస్‌ కాకుండా దర్శకుడు బీవీఎస్‌ రవి రాసుకోగలిగాడు. హీరోకు విలన్‌ ఎప్పుడు దొరుకుతాడన్న ఆసక్తి కలిగించాడు. అయితే ప్రధాన కథకు హీరో ప్రేమ కథ బ్రేక్‌లు వేస్తుంటుంది. పాటల పరిస్థితీ అంతే. సరదాగా నవ్వుకోవడానికి ఒక్క సన్నివేశం కూడా లేదే అనిపిస్తుంది. విశ్రాంతి ముందు ఘట్టం, విలన్‌ను హీరో పట్టుకునే యత్నాలు దర్శకుడి ప్రతిభకు అద్దం పడతాయి. అయితే ఆక్టోపస్‌ మిసైల్‌, ప్రాజెక్టు 3 తదితర వ్యవహరాలు సామాన్య ప్రేక్షకుడికి కొంచెం అర్థం కాకపోవచ్చు.

ఇప్పటివరకూ సరదా సరదాగా, అల్లరి అబ్బాయి పాత్రల్లో నటించిన సాయిధరమ్‌తేజ్‌ తొలిసారి ఓ బాధ్యతాయుతమైన పాత్రలో కనిపించాడు. అతని లుక్‌, డైలాగ్‌ డెలివరీలో మార్పు కనిపించింది. తనదైన హుషారు తగ్గినప్పటికీ సెటిల్డ్‌ పెర్ఫామెన్స్‌ చేయగలిగాడు. గెలుపు, ఓటమి గురించి చెప్పే సందర్భంలో సాయి నటన బాగుంది. మెహరీన్‌ పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితమైంది. చాలా బొద్దుగా కనిపించింది. ప్రసన్నది కచ్చితంగా ఆకట్టుకునే పాత్ర.

Plus Points:

హీరో-విలన్ల మధ్య వచ్చే సన్నివేశాలు
సంభాషణలు
ప్రసన్న నటన

Minus Points:

వినోదం పాళ్లు తగ్గడం
పాటలు

Final Verdict:

‘జవాన్‌’ ఆడే మైండ్‌గేమ్‌ ఇది!

Young Amaravati Rating: 3 / 5

Trailer:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here