ఆమె కురుల పొడవెంతో తెలుసా..!

0
28

కురులంటే ఇష్టం లేని ఆడవాళ్లుంటారా? పొడవాటి జుట్టును పెంచుకోవడానికి కొందరు నానా తిప్పలు పడుతుంటారు. విదేశాల్లో మాత్రం దీనిని భిన్నంగా పొట్టి జుట్టును ఉంచుకోవడానికే ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. కానీ.. వియత్నాంకు చెందిన 81 ఏళ్ల త్రిన్‌ థి నగైన్‌ అనే మహిళ ఏకంగా 3 మీటర్ల జట్టును పెంచేసి ఔరా అనిపించింది.

ఆ దేశంలో చాలా మంది మహిళలు జట్టు పెరగకుండా అగ్గిసెగ పెడతారు. దీని వల్ల కురులు పాక్షికంగా కాలిపోయి పెరుగుదల మందగిస్తుంది. చిన్న తనంలో నగైన్‌ కూడా అలానే చేసేదట. అనుకోకుండా ఒక రోజు తలకు నిప్పంటుకొని గాయాలపాలైంది. దీంతో అప్పటి నుంచి అలా చేయడం మానేసింది. అందువల్ల జట్టు పొడవుగా పెరగడంతోపాటు దువ్వు కోవడానికి వీలు లేకుండా జడలు కట్టేసింది. అప్పటి నుంచి జుట్టును పొట్టిగా కత్తిరించుకోవడం ప్రారంభించింది.

తన 22 ఏళ్ల వయస్సులో దానికి కూడా స్వస్తి చెప్పింది. దీంతో ఆ జడ అమాంతం పెరిగి ప్రస్తుతం 3 మీటర్ల పొడవైంది. ఈ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. 81 ఏళ్ల వయస్సులో అంతపెద్ద జుట్టును ఎలా భరిస్తున్నావంటూ నెటిజెన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఎక్కడికైనా బయటకు వెళ్లినపుడు ఆ జడనంతా శిగలా చేసి తలపై పెట్టుకుంటానంటోంది ఈ బామ్మ. తన జుట్టును చూసి చాలా మంది చిన్నారులు భలే ముచ్చట పడతారని, విచిత్రమైన ప్రశ్నలన్నీ అడుగుతారని చెబుతోంది. ఆమెకు తలస్నానం చేయడానికి ఒక గంట సమయమైనా పడుతుందట. ఇక కురులను ఆరబెట్టాలంటే కనీసం రోజైనా చాలదట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here