పెళ్లి చూపులు, అర్జున్‌రెడ్డి సినిమాల గీత రచయితకు వేధింపులు…!

0
259

పెళ్లి చూపులు, అర్జున్‌రెడ్డి సినిమాల్లో పాటలు రాసిన శ్రేష్ఠ ఇప్పటికే ‘మీ టూ’ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. మహిళా గీత రచయితగా తెలుగు సినీ పరిశ్రమలో తాను కూడా వేధింపులు ఎదుర్కొన్నానన్న ఆమె మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

గోవాలో జరిగిన ఓ పార్టీకి తాను రావాలంటూ ఓ దర్శకురాలు బలవంతం చేసిందనీ, ఓ వ్యక్తిని పరిచయం చేసి అతను నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పిందన్నారు. కానీ అదే వ్యక్తి తనకు ఫోన్‌ చేసి..ఆ దర్శకురాలు నీ గురించి ఇంకోలా చెప్పిందని చీప్‌గా మాట్లాడటంతో షాక్‌ అయ్యానని వెల్లడించారు. ఆ దర్శకురాలిని చెప్పుతో కొట్టాలనిపించిందనీ..ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన అమ్మాయిలను వేధింపులకు గురిచేసేవారిలో మహిళలు కూడా ఉంటారన్న శ్రేష్ఠ మాటలు కలకలం రేపాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here