సుమంత్ “మళ్లీ రావా” స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో)

0
86

Movie Title (చిత్రం): మళ్ళీ రావా

Cast & Crew:

  • నటీనటులు: సుమంత్, ఆకాంక్ష, మిర్చి కిరణ్, కార్తీక్ అడుసుమిల్లి, మాస్టర్ సాత్విక్, బేబి ప్రీతి అస్రాని, అన్నపూర్ణ తదితరులు
  • సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
  • నిర్మాత: రాహుల్ యాదవ్ నక్క
  • దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి

Story:

మళ్ళీ రావా! అనే టైటిల్తో ఓ రొమాంటిక్ కథ. ఇద్దరు ప్రేమికులు మధ్య సాగే సినిమా. కార్తీక్(సుమంత్), అంజలి(ప్రేమికులు) తొమ్మిదో తరగతి నుండే ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంటుంది. అది ప్రేమ అని కూడా చెప్పలేనంత ఇష్టం. తర్వాత పరిస్థితుల ప్రభావంతో ఇద్దరూ విడిపోతారు. అంజలి అమెరికా వెళ్లిపోతుంది. తర్వాత హైదరాబాద్లో ఓ ప్రాజెక్ట్ పని మీద వస్తుంది. అదే ఆఫీస్లో కార్తీక్ కనపడతాడు. మళ్లీ ఇద్దరూ ప్రేమలో పడతారు. అంజలిపై తనకున్న పేమ గురించి కూడా కార్తీక్ ఆమెతో చెబుతాడు. అంజలి తన మనసులో కార్తీక్పై ఉన్న ప్రేమలో వ్యక్త పరుస్తుంది. అంతే కాకుండా పెళ్లి చేసుకుందామనే ప్రపోజ్ కూడా పెడుతుంది. సరేనని రిజిస్ట్రార్ ఆఫీస్కు చేరుకుంటాడు కార్తీక్. అక్కడకు వచ్చిన అంజలి..తనకు కార్తీక్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెబుతుంది. కానీ కార్తీక్ ఆమెను ఎమీ అనడు. మళ్లీ అంజలి అమెరికా వెళ్లిపోతుంది. ఐదేళ్ల తర్వాత కార్తీక్ ఆస్ట్రేలియా వెళ్లడానికి రెడీ అవుతాడు. అదే సమయంలో వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఇండియా వస్తుంది అంజలి. అక్కడ కార్తీక్ ఆమెకు తారసపడతాడు. అసలు కార్తీక్ను అంజలిని ఎందుకు పెళ్లి చేసుకోదు? చిన్నప్పుడు కార్తీక్, అంజలి విడిపోవడానికి కారణాలేంటి? చివరకు ఇద్దరూ కలుసుకుంటారా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Review:

తెలుగు సినిమాల్లో చాలా ప్రేమ‌క‌థ‌లు వ‌స్తుంటాయి. ప్రేమ‌క‌థ అన‌గానే ఎమోష‌న్స్‌ను క్యారీ చేసే విధానం, ప్రెజెంట్ చేసే తీరుపై వాటి స‌క్సెస్‌లు ఆధార‌ప‌డి ఉంటాయి. అలాంటి డిఫ‌రెంట్ క‌థ‌నంతో ద‌ర్శ‌కుడు గౌత‌మ్ సినిమాను న‌డిపిన తీరు మెప్పిస్తుంది. మూడు స్టేజ‌స్‌లో జ‌రిగే ప్రేమ‌క‌థ ఇది.హీరో సుమంత్‌, హీరోయిన్ ఆకాంక్ష చ‌క్క‌గా త‌మ న‌ట‌న‌తో ఆ ఎమోష‌న్స్‌ను ప‌లికించారు. ఇక అన్న‌పూర్ణ‌మ్మ క్యారెక్ట‌ర్ వ్యంగ్యంగా ఉంటూ చివ‌ర్లో కాస్త ఎమోష‌న్‌కు గురి చేస్తుంది. మిర్చి కిర‌ణ్ కామెడి ట్రాక్ బావుంది. సినిమాలో కామెడీని ఎంజాయ్ చేసే పార్ట్‌లో మిర్చి కిర‌ణ్ అండ్ గ్యాంగ్ చ‌క్క‌గా న‌టించారు.

ప్ర‌తి స‌న్నివేశాన్ని అందంగా చూపించాడు. గ‌తంలో ఎటోవెళ్లిపోయింది మ‌న‌సు త‌ర‌హా క‌థ ఇది. నువ్వు ద‌గ్గ‌రగా ఉన్న‌ప్పుడు ఇష్ట‌ప‌డ‌టం, దూరంగా ఉన్న‌ప్పుడు బాధ‌ప‌డ‌టం త‌ప్ప నాకేం తెలియ‌దు …నువ్వు లేద‌నే బాధ క‌న్నా..నిన్ను క‌లిస్తే ఎక్క‌డ దూర‌మైపోతానో అనే భ‌యం ఉంది..నీ గుండెలో మ‌నం విడిపోమ‌ని అనిపించి, ఏ భ‌యం లేన‌ప్పుడు మ‌నం క‌లుద్దాం. ..వంటి డైలాగ్స్ ద‌ర్శ‌కుడి సంభాష‌ణ‌ల ప‌వ‌ర్‌ను చూపించింది. మంచి ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీల‌ను ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కులు `మ‌ళ్ళీరావా` సినిమాను త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు.

Plus Points:

నటీనటుల పనితీరు

కథనం

బ్యాక్గ్రౌండ్ స్కోర్

సినిమాటోగ్రఫీ

Minus Points:

స్లో నెరేషన్

Young Amaravati Rating: 3.25 / 5

Final Verdict:

`మళ్ళీ రావా` మంచి ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీ… నేటి తరం ప్రేమకథ

Trailer:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here