అమ్మాయి పిలిచిందని అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు..కానీ జరిగింది ఇది

0
38

అందమైన అమ్మాయి చాటింగ్ చేస్తుందని సంబరపడ్డాడు. ఆమెకు దగ్గరవ్వాలని కలలు కన్నాడు. అపార్ట్‌మెంట్‌కు రావాలని ఆహ్వానించడంతో ఎగిరి గంతేశాడు. ఆనందంతో కారులో బయలుదేరి వెళ్లాడు. ఉత్సాహంతో డోర్ కొట్టాడు. కానీ షాక్.. ఊహించని షాక్.. నైజీరియాకు చెందిన ఓ మహిళ తలుపు తెరచి ఆహ్వానించింది. ‘‘నేను చాటింగ్ చేసింది ఎవరితో.. నాతో డేటింగ్ చేస్తానంది ఎవరు’’ అని ప్రశ్నించాడు. ‘‘నీతో చాటింగ్ చేసిన అమ్మాయి లోపల ఉంది’’ అని చెప్పడంతో లోపల అడుగుపెట్టాడు. అంతలోనే వచ్చిన మరో నైజీరియన్ డోర్‌లాక్ చేసింది.

ఇద్దరు యువతులు కలిసి డబ్బులు ఇవ్వాలంటూ లోపలికి వచ్చిన యువకుడిని డిమాండ్ చేశారు. నిరాకరించడంతో లోపలే ఉన్న మరో ముగ్గురు నైజీరియన్ యువకులను పిలిచారు. బాధితుడిని తీవ్రంగా కొట్టి చంపేస్తామని బెదిరించి అతడి వద్ద బ్యాంక్ కార్డులను తీసుకున్నారు. దాదాపు 1 లక్ష దిర్హమ్‌లను విత్‌డ్రా చేశారు. అనంతరం నిందితుడిని వదిలిపెట్టారు. దీంతో షాక్ గురైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

సోషల్ మీడియాలోని ఓ యాప్‌లో ఖాతా తెరిచి ఓ అందమైన అమ్మాయి ఫోటోతో బాధితుడిని నమ్మించి చాటింగ్ చేశారని, అపార్ట్‌మెంటుకు రావాలని ఆహ్వానించారని దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు వెల్లడించారు. బాధితుడు యూరోపియాకు చెందినవాడని పోలీసులు తెలిపారు. కేసుపై కోర్టులో విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. రష్యా అమ్మాయితో తనకు పరిచయమైందని, తనకు ఫోన్ నంబర్ ఇచ్చిందని, ఇద్దరి మధ్య స్నేహం పెరగడంతో ఆమె ఆహ్వానం మేరకు అపార్ట్‌మెంట్‌కు వెళ్లాలని వాపోయాడు. ఈ ఘటన యూఏఈలోని దుబాయ్ నగరంలో జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here