ఈ అమ్మాయి పాటను ఒక్కరోజులో 40 లక్షల మందికి పైగా వీక్షించారు.

0
1083

ప్రేమికుల రోజు వచ్చేస్తోంది. యువత వారం రోజుల ముందు నుంచే తమకు ఇష్టమైన వారిని కానుకలతో ఎలా సర్‌ప్రైజ్‌ చేయాలా అని తెగ ఆలోచించేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ అందమైన అమ్మాయి..తన ప్రియుడిని చూస్తూ కన్నుకొడుతున్న సన్నివేశం సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఆ అమ్మాయికి నెటిజన్లు కూడా ఫిదా అయిపోయారు.

ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే..మలయాళంలో తెరకెక్కుతున్న ‘ఒరు అదర్ లవ్‌’ అనే చిత్రంలో కథానాయిక. పేరు ప్రియ ప్రకాశ్‌ వారియర్‌. ఆదివారం ఈ చిత్రంలోని ‘మాణిక్య మలరయ పూవి’ అనే పాట విడుదలైంది. ఆ చిత్రంలో ప్రియ హైస్కూల్‌ విద్యార్థినిగా నటిస్తోంది. పక్కనే నిలబడిన తన ప్రియుడిని చూసి ప్రియ కన్ను కొడుతున్న సన్నివేశం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ప్రేమికుల రోజు రాబోతున్న సందర్భంగా ఈ అమ్మాయి కన్నుకొడుతున్న సన్నివేశాన్ని ఉపయోగించుకొని నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఈ పాటను ఒక్కరోజులో 40 లక్షల మందికి పైగా వీక్షించారు.

Watch Video:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here