బాలయ్య రియల్ స్టంట్..!! హీ నీడ్స్ నో స్టంట్ డ్రైవర్ (వీడియో)

0
23


నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘పైసా వసూల్‌’. పూరీ జగన్నాథ్‌ దర్శకుడు. శ్రియ కథానాయిక. భవ్య క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. సెప్టెంబరు 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆడియోను ఆగస్టు 17న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ పోరాట సన్నివేశం కోసం బాలయ్య డూప్‌ లేకుండా నటించిన సంగతి తెలిసిందే.

తాజాగా బాలయ్య స్వయంగా డూప్ లేకుండా చేసిన కార్ స్టంట్ కు సంబంధించిన వీడియో టీజర్ ను రిలీజ్ చేశారు. శ్రియతో పాటు కారులో వెళ్తున్న బాలయ్య స్వయంగా జీర్ కట్ చేసి యూనిట్ సభ్యులను ఆశ్చర్యపరిచాడు. అందుకే స్టంట్ ను చూపిస్తూ స్పెషల్ టీజర్ రిలీజ్ చేసిన యూనిట్ ‘హీ నీడ్స్ నో స్టంట్ డ్రైవర్’ (ఇతనికి స్టంట్ డ్రైవర్ అవసరం లేదు) అంటూ టీజర్ ను ముగించారు.

Watch Video:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here