రాణా “నేనే రాజు నేనే మంత్రి” స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో)

0
26


Movie Title (చిత్రం): నేనే రాజు నేనే మంత్రి (Nene raju nene mantri)

Cast & Crew:

• నటీనటులు: రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్, కేథరిన్ ట్రెసా, నవదీప్ తదితరులు
• సంగీతం: అనూప్ రూబెన్స్
• నిర్మాత: సురేష్ దగ్గుబాటి, CH భరత్ చౌదరి మరియు V కిరణ్ రెడ్డిలు (సురేష్ ప్రొడక్షన్స్ & బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల)
• దర్శకత్వం: తేజ

Story:
జోగేంద్ర (రాణా) అనే వ్యక్తి రాజకీయ జీవితం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. జోగేంద్ర ఒక ఫైనాన్షియర్, తనకు తెలిసిన వాళ్ళకి ఫైనాన్స్ కి డబ్బు ఇస్తూ ఉండేవాడు. కొద్దీ రోజులకి అతనికి రాజకీయాల మీద ఇంటరెస్ట్ వస్తుంది. ముఖ్యమంత్రి కావాలి అనుకుంటాడు. అతని భార్య “రాధా” (కాజల్). తన భార్య కోసం ఏదైనా చేయాలనుకుంటాడు జోగేంద్ర. వీళ్ళ మధ్యలో చిచ్చు పెట్టడానికి, రాజకీయంగా అతనిని దెబ్బ తీయడానికి వస్తుంది “దేవిక రాణి” (కాథరిన్). ఆపదలను జోగేంద్ర ఎలా ఎదురుకున్నాడు అనేది తెలియాలి అంటే “నేనే రాజు నేనే మంత్రి” సినిమా చూడాల్సిందే!

Review:
‘బాహుబలి’ తరవాత రానా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే భారీ అంచనాల మధ్య ‘నేనే రాజు నేనే మంత్రి’ విడుదలైంది. లీడర్ కూడా పొలిటికల్ సినిమానే. కానీ అందులో రాణా క్లాస్. ఇందులో ఫుల్లీ మాస్. సక్సెస్‌కు చాలా దూరంగా ఉన్న తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. దర్శకుడు తేజ కథను మలిచిన తీరు బాగుందట. రాజకీయ నాయకుడిగా పంచె కట్టులో రానా లుక్ అదుర్స్ అంటున్నారు. ఇది రానా వన్ మ్యాన్ షో అని ప్రేక్షకులు అంటున్నారు. జోగేంద్ర పాత్రలో ఇరగదీశాడని, తనలోని నటనా విశ్వరూపాన్ని చూపించాడని టాక్. తొలి అర్థ భాగం మొత్తం పొలిటికల్ సీన్లతోనే ఈ చిత్రాన్ని తేజ నడిపించాడట. మధ్య మధ్యలో కొన్ని సీన్లు బోర్ కొంటిస్తాయట. కాజల్, రానా మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు బాగున్నాయంటున్నారు. అయితే సెకండ్ హాఫ్ మాత్రం మిశ్రమ స్పందన వినబడుతోంది. ఫస్ట్ హాఫ్‌ని మించే విధంగా రెండో భాగం ఏమీ లేదని కొందరు అంటున్నారు. కొంత మంది అయితే రెగ్యులర్ ఆడియన్స్‌కి ఇది పెద్దగా నచ్చకపోవచ్చు.. కానీ డిఫరెంట్ స్క్రిప్టు కోరుకునే ప్రేక్షకులకు సెకండ్ హాఫ్ బాగా నచ్చుతుంది అంటున్నారు. ముఖ్యంగా యాంటీ క్లైమాక్స్‌ని తెలుగు ఆడియన్స్ జీర్ణించుకుంటారా లేదా అనేది పెద్ద ప్రశ్న.

Plus Points:
స్టోరీ
రాణా పెర్ఫార్మన్స్
రాణా- కాజల్ రొమాంటిక్ కెమిస్ట్రీ
పవర్ఫుల్ డైలాగ్స్
తేజ డైరెక్షన్
Minus Points:
సెకండ్ హాఫ్ అంతగా ఆకట్టుకోదు
అర్ధం పర్థం లేని కొన్ని ఫైట్స్


Final Verdict:
పాలిటిక్స్ తో సెంటిమెంట్ కలిస్తే ఈ సినిమా. ఫస్ట్ హాఫ్ అదుర్స్. సెకండ్ హాఫ్ అంతగా నచ్చకపోవచ్చు. క్లైమాక్స్ మాత్రం జీర్ణించుకోలేరు.

Young Amaravati Rating: 4 / 5

Trailer:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here