ఆర్బీఐ సంచలన నిర్ణయం.. సరికొత్త రంగులో పది నోట్లు…

0
203

భారత కరెన్సీలో పెద్దనోట్లు కొత్త రూపం దాల్చి ఏడాది దాటిన తర్వాత తాజాగా ఇప్పుడు 10 రూపాయల నోటు వంతు వచ్చింది. త్వరలోనే పది రూపాయల నోటు సరికొత్త రంగులు అద్దుకోనుంది. మహాత్మాగాంధీ సిరీస్‌‌ కింద చాక్లెట్ బ్రౌన్ రంగుతో కొత్త పది రూపాయల నోటును విడుదల చేయనున్నట్టు సమాచారం. త్వరలోనే విడుదల చేసేందుకు సిద్ధమైన ఆర్బీఐ… ఇప్పటికే 100 కోట్ల నోట్లను ముద్రించినట్టు చెబుతున్నారు. ఓ జాతీయ మీడియా సంస్థ ప్రచురించిన కథనం ప్రకారం… వారం రోజుల క్రితమే కొత్త పదిరూపాయల నోటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న పది రూపాయల నోటు డిజైన్‌ను చివరిసారిగా 2005లో మార్చారు. గతేడాది ఆగస్టులో మహాత్మాగాంధీ సిరీస్‌లో రూ.50, రూ.200 కొత్తనోట్లు చెలామణీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. నకిలీ నోట్ల బెడద నుంచి విముక్తి పొందేందుకు, నగదు వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా చిన్న డినామినేషన్ నోట్లను రీడిజైన్ చేసి అందుబాటులోకి తెస్తున్నారు. 2016 నవంబర్ 8న భారత కరెన్సీలో 86 శాతంగా ఉన్న రూ.500, రూ.1000 నోట్లను ప్రధాని మోదీ రాత్రికి రాత్రే రద్దు చేసిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here