ఇన్ఫోసిస్ కొత్త సీఈవో జీతమెంతో తెలుసా..!

0
118

ఇన్ఫోసిస్‌కు కొత్తగా సీఈవో బాధ్యతలు స్వీకరించిన సలీల్‌ పరేఖ్‌ జీతమెంతో తెలిస్తే.. షాక్ కు గురౌతారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో పిక్స్‌డ్‌ శాలరీ కింద ఈయన రూ.6.5 కోట్లను అందుకోనున్నారని వెల్లడించారు. ఇంకా.. రూ.9.75 కోట్లను వేరియబుల్‌ చెల్లింపులు కింద పొందనున్నారని స్వతంత్ర బోర్డు సభ్యురాలు కిరణ్‌ మజుందర్‌ షా తెలిపారు. కాగా మంగళవారం నుంచి ఇన్ఫోసిస్‌ సీఈవోగా, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పరేఖ్‌ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇన్ఫోసిస్‌ నామినేషన్‌ అండ్‌ రెమ్యూనరేషన్‌ కమిటీలో కిరణ్‌ మజుందర్‌ షా ఒక సభ్యురాలు.

అయితే నియంత్రిత స్టాక్‌ యూనిట్ల కింద కొత్త​ సీఈవో మరో రూ. 3.25 కోట్లను పొందనున్నారని, అలాగే.. వార్షిక పనితీరు కింద అందజేసే ఈక్విటీ గ్రాంట్లు రూ.13 కోట్లుగా ఉండనున్నట్టు పేర్కొన్నారు. అంతేకాక ఒ‍క్కసారి ఈక్విటీ గ్రాంట్‌ కింద పరేఖ్‌కు రూ.9.75 కోట్లు అందజేయనున్నట్టు వెల్లడించారు. ఇన్ఫీకి అంతకముందు సీఈవోగా ఉన్న విశాల్‌ సిక్కా వేతనం కింద సుమారు రూ.43 కోట్లు పొందేవారు. సిక్కా వేతనం విషయంలోనే కంపెనీ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here