చక్రాల కుర్చీ నుంచి పడిపోయిన ప్రయాణికురాలు ఇండిగో ఎయిర్‌లైన్స్‌.. మూడోసారి

0
33

గతంలో ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి సింధుతో అమార్యదకరంగా ప్రవర్తించి వార్తల్లోకెక్కింది ఇండిగో ఎయిర్‌లైన్స్‌. ఆ తర్వాత ఇటీవల ప్రయాణికుడిపై చేయిచేసుకున్న ఘటన వివాదాస్పమైంది. ఈ రెండు ఘటనలు జరిగిన కొద్దిరోజులకే మూడోసారి ఇండిగో వార్తల్లోకెక్కింది.

ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూ విమానాశ్రయంలో శనివారం రాత్రి ఓ దివ్యాంగురాలు చక్రాల కుర్చీ నుంచి పడిపోయింది. లఖ్‌నవూకి చెందిన వూర్వశి అనే యువతి విమానాశ్రయానికి చేరుకోగానే ఆమెకు సాయం చేయడానికి ఇండిగో సిబ్బంది వచ్చారు. చక్రాల కుర్చీలో కూర్చున్న ఆమెను సిబ్బంది తీసుకెళుతుండగా కుర్చీ అదుపుతప్పింది. దాంతో ఆమె కిందపడిపోయింది.

ఆమెకు దెబ్బలు తగలడంతో వెంటనే సిబ్బంది దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషయంపై ఇండిగో సంస్థ వివరణ ఇస్తూ ప్రయాణికురాలికి క్షమాపణలు చెప్పింది. ఇది కావాలని చేసిన పని కాదని పొరపాటున ఆమె కింద పడిపోయారని పేర్కొంది.

నవంబర్‌ 7న ఇండిగోకి చెందిన ఇద్దరు సిబ్బంది ఓ ప్రయాణికుడిని చితకబాదిన ఘటన దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇండిగో యాజమాన్యం బాధితుడికి క్షమాపణలు చెప్పి సిబ్బందిని విధుల నుంచి తొలగించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here