పవన్‌ కల్యాణ్‌ కొడుకు పేరు తెలుసా…? ఈ పేరు పెట్టడం వెనుక ఓ చిన్న సైజు కథే ఉందట

0
22

ఇదేం పేరబ్బా… ఎవరో పవన్‌ కల్యాణ్‌ ఫ్యానో, చిరంజీవి అభిమానో పెట్టుకొని ఉంటారు అనుకుంటున్నారా? ఇది అభిమాని పేరు కాదు… టాలీవుడ్‌లో స్టార్‌గా వెలుగొందుతున్న ఓ స్టార్‌ హీరో కొడుకు పేరు. అంటే… పవన్‌ కల్యాణ్‌ కొడుకు పేరు ఇది. ఇటీవల పనవ్‌ భార్య అన్నా లెజినోవా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ బాబుకు ‘మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌ కొణిదెల’ అని పేరు పెట్టారు. ఇప్పుడు అంతర్జాలంలో ఈ పేరు గురించి పెద్ద చర్చే నడుస్తోంది. పవన్‌ తన కొడుక్కి ఈ పేరు పెట్టడం వెనుక ఓ చిన్న సైజు కథే ఉందట.

భార్య అన్నా లెజినోవా ఆలోచనలు, మత సంప్రదాయాలకు విలువ ఇచ్చి పవన్‌ వారి బిడ్డకు ఈ పేరు పెట్టాడట. ఆమె రష్యన్‌ ఆర్థోడక్స్‌ మత సంప్రదాయాలను పాటిస్తారు. దానికి అనుగుణంగానే పవన్‌ తన బిడ్డకు పేరు పెట్టారు. క్రైస్తవ మతంలో బాగా ప్రాచుర్యం పేరు ‘మార్క్‌’. మార్కస్‌ అనే దేవుడికి సంక్షిప్త నామంగా చెప్పొచ్చు. చిరంజీవి అసలు పేరు శివశంకర్‌ వరప్రసాద్‌ నుంచి ‘శంకర్‌’ను తీసుకొన్నారు. పవన్‌ పేరును పవనోవిచ్‌ అని మార్చి… పూర్తిగా ‘మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌’ అని పెట్టారు.

పవన్‌ కల్యాణ్‌, అన్నా లెజినోవాకు పుట్టిన కూతురు పేరు పొలెనా అని మాత్రమే తెలుసు. ఆమె పూర్తి పేరు పొలెనా అంజనా పవనోవా అంట. ఈ పేరు కూర్పు వెనుక కూడా ఆసక్తికరమైన విషయం ఉంది. తన తల్లి అంజనాదేవి నుంచి ‘అంజన’ను తీసుకొని.. తన పేరులోని పవన్‌ను పవనోవాగా మార్చి ‘పొలెనా అంజనా పవనోవా’ అని పెట్టారు. నటనలోనే కాదు… పిల్లల పేర్లు పెట్టడంతో పవన్‌ వైవిధ్యం చూపిస్తున్నారన్నమాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here