ప్రియను ఇంటినుంచి పంపించేసిన తల్లి..!

0
354

తొలి చూపులోనే వ‌లపు బాణం గుచ్చే అంద‌గ‌త్తెలు చాలా అరుదు. ఇప్పుడు అదే జాబితాలోకి వేరొక కొత్త భామ కూడా చేరిపోతోంది. ఈ అమ్మ‌డి లుక్స్ కిల్లింగ్‌. మ‌త్తెక్కి మైమ‌రిచిపోతున్నారు కుర్రాళ్లంతా. ఈ భామ లుక్ ఇలా ఆన్‌లైన్‌లోకి వ‌చ్చిందో లేదో సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అయిపోయింది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అల్లాడిపోయాయి. వాట్సాప్ లలోనూ జోరుగా ఈ భామ విజువ‌ల్ అప్పియ‌రెన్స్‌ను యూత్ బాగా షేర్ చేస్తున్నారు. వేడి పుట్టిస్తున్న యువ‌క‌థానాయిక ప్రియ ప్ర‌కాష్ స్ట్రైకింగ్ లుక్స్ డిఫ‌రెంట్ అప్పీల్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.

సోషల్ మీడియా అంతా ఇప్పుడు ఓ కేరళ కుట్టి గురించి చర్చ జరుగుతోంది. ఆ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం 20 సెకన్లలో తన హావభావాలతో నెటిజన్లను ఫిదా చేసి స్టార్ హీరోలను కూడా చూపు తిప్పుకోనీకుండా చేసిన ప్రియాకు ఇప్పుడో కష్టమొచ్చింది. సెలబ్రెటీ రానంత వరకూ ఎవరూ పట్టించుకోరు ఒక్కసారిగా పైగా ఈ రేంజ్లో సెలబ్రెటీ హోదా దక్కించుకుంటే మీడియా దృష్టంతా అలాంటి వాళ్ల పైనే ఉంటుంది. ఇప్పుడు ప్రియా ప్రకాష్ పరిస్థితి కూడా అదే.

ఈ రేంజ్లో క్రేజ్ రావడంతో ఆమె ఇంటర్వ్యూ కోసం మీడియా ప్రతినిధులు క్యూ కడుతున్నారు. ఆమె ఇంటి చుట్టూ కోలాహలం నెలకొంది. అయితే తమ కూతురికి పేరు రావడం మంచిదే అయినా మీడియా చేస్తున్న హడావుడితో ఒకింత ఇబ్బందిగా కూడా ఉందని ప్రియా తల్లి ప్రీతా తెలిపారు. తనకు మీడియా ప్రతినిధుల నుంచి ఫోన్లు వస్తున్నాయని, ప్రియా హాస్టల్కు వెళ్లిపోయిందని చెప్పినట్లు ఆమె వెల్లడించారు.

హాస్టల్కు ఎందుకు పంపించారని ప్రియా తల్లిని అడగ్గా ఉన్నట్టుండి వచ్చిన ఈ క్రేజ్తో తమ కూతురికి కొంత ఇబ్బందిగా కూడా ఉందని ఆమె చెప్పారు. అందుకే ఈ హడావుడి తగ్గేంత వరకూ హాస్టల్కు పంపినట్లు తెలిపారు. పైగా చిత్ర దర్శకుడు కూడా సినిమా విడుదలయ్యే దాకా ప్రియా ఎలాంటి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వొద్దని చెప్పినట్లు ఆమె తల్లి చెప్పారు. సినిమా కొంత మాత్రమే పూర్తయిందని, ఇంకా షూటింగ్ చేయాల్సింది చాలా ఉందని దర్శకుడు తమతో చెప్పాడని, ఈ తలనొప్పంతా ఎందుకని ప్రియాను హాస్టల్కు పంపినట్లు ఆమె తల్లి ప్రీతా తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here