సాయి పల్లవి అమాంతం రెమ్యునరేషన్ పెంచేసిందంట..!

0
180

‘ఫిదా’ఒక్క సినిమాతో తెలుగింట్లో సొంత పిల్లలా మారిపోయారు హీరోయిన్ సాయి పల్లవి. అంతే కాకుండా సినిమాకు సినిమాకు రెమ్యునరేషన్ ను కూడా అమాంతం పెంచేసుకుంటున్నారు. తాజాగా హీరో నానీకి జోడీగా ‘ఎంసీఏ’ లో నటించి సూపర్ హిట్ అందుకోవడంతో ఇక సాయిపల్లవి రేంజ్ ముమ్మరంగానే దూసుకెళ్తుంది. అదేవిధంగా ఆ బ్యూటీ రెమ్యునరేషన్ కు అమాంతం పెంచేసుకుంటూ పోతున్నారు.

కాగా ఆమె డేట్స్ కోసం పెద్ద సంస్థలు సైతం ప్రయత్నిస్తున్నాయని, సాయి పల్లవి డేట్స్ క్యాలెండర్ లో ఈ సంవత్సరం ఖాళీ లేదని టాలీవుడ్ టాక్. అయితే.. 2019లోనైనా ఆమె డేట్స్ తీసుకోవాలని కొందరు ప్రముఖ నిర్మాతలు సాయి పల్లవిని సంప్రదిస్తే.. రెమ్యునరేషన్ వారు ఊహించని రేంజ్ లో అడిగినట్లు సమాచారం అందుతుంది. దీంతో అవాక్కైన నిర్మాతలు ఆలోచనలో పడినట్లుగా తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here