“సప్తగిరి ఎల్ఎల్‌బీ” స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో)

0
96

Movie Title (చిత్రం): సప్తగిరి LLB

Cast & Crew:

  • నటీనటులు: స‌ప్త‌గిరి, క‌శిష్ వోరా, సాయికుమార్, ఎన్‌.శివ‌ప్ర‌సాద్‌, డా.ర‌వికిర‌ణ్ త‌దిత‌రులు
  • సంగీతం: బుల్గాని
  • నిర్మాత: డా.ర‌వికిర‌ణ్‌
  • దర్శకత్వం: చ‌ర‌ణ్ ల‌క్కాకుల‌

Story:

స‌ప్త‌గిరి (స‌ప్త‌గిరి) పుంగ‌నూరు మండ‌లంలోని ఒక చిన్న ప‌ల్లెటూరికి చెందిన రైతుబిడ్డ‌. ఎల్ ఎల్ బీ చ‌దువుకుంటాడు. ఉండూరులో ఎన్ని కేసులు వాదించినా విలువ ఉండ‌ట్లేద‌ని భావిస్తాడు. సిటీకి వెళ్లి మంచి పేరు, డ‌బ్బు తెచ్చుకుని త‌న మ‌ర‌ద‌లు చిట్టి (క‌శిష్ వోరా) ని పెళ్లి చేసుకోవాల‌నుకుంటాడు. ఆ ప్ర‌కార‌మే సిటీకి చేరుకుని త‌న బావ (నిర్మాత ర‌వికిర‌ణ్‌) అండ చూసుకుని గ‌డుపుతుంటాడు. అలాంటి స‌మ‌యంలో అత‌నికి రాజ్ పాల్ (సాయికుమార్‌) అనే లాయ‌ర్ గురించి తెలుస్తుంది. పేరున్న రాజ్‌పాల్ వాదించిన ఓ కేసును పిల్ వేసి మ‌ర‌లా రియోప‌న్ చేయిస్తాడు స‌ప్త‌గిరి. ఆ కోర్టుకు జ‌డ్జి (శివ‌ప్ర‌సాద్‌). ఆ క్ర‌మంలో ఏమైంది? రాజ్‌పాల్ క్లైంట్ ఎవ‌రు? అత‌ను చేసిన యాక్సిడెంట్‌లో చ‌నిపోయింది ఎవ‌రు? భిక్ష‌గాళ్లా? రైతులా? సిటీలో ప‌ట్టుకున్న తొలి కేసులోనే స‌ప్త‌గిరి ఎలా వాదించాడు? అహంకారంతో ఉన్న రాజ్‌పాల్‌కి స‌ప్త‌గిరి ఎలాంటి ఝ‌ల‌క్‌లు ఇచ్చాడు? అనేది ఆస‌క్తిక‌రం.

Review:

భార‌త రాజ్యాంగం దేశంలోని ప్ర‌జ‌లంద‌రికీ న్యాయం స‌మానంగా దక్కాల‌ని చెబుతుంది. కోర్టులు కూడా అదే రీతితో ప‌నిచేయాల‌ని కూడా సూచించింది. అదే రీతిలో స‌రైన ఆధారాలుంటే మ‌న వ్య‌వ‌స్థ‌లు కూడా ప‌నిచేస్తున్నాయి. అలాగే మ‌నం త‌రుచు మ‌నం పేప‌ర్ల‌లో రోడ్ యాక్సిడెంట్స్‌ను చూస్తుంటాం. ఆ యాక్సిడెంట్స్‌లో నిందితుల‌కు మాత్రం శిక్ష ప‌డ‌టం మ‌నం చూసుండం ఇలాంటి సెన్సిటివ్ పాయింట్‌ను పై రూపొందిన జాలీ ఎల్‌.ఎల్‌.బి మంచి విజ‌యం సాధించింది. దీన్ని తెలుగులో స‌ప్త‌గిరి ఎల్‌.ఎల్‌.బిగా రీమేక్ చేశారు. టైటిల్ పాత్ర‌లో క‌మెడియ‌న్ స‌ప్త‌గిరి న‌టించ‌డం విశేషం.

ముందు కామెడీతో త‌ర్వాత సీరియ‌స్‌గా సాగే పాత్ర‌లో త‌న‌దైన రీతిలో స‌ప్త‌గిరి పాత్ర‌లో ఒదిగిపోయాడు. అలాగే సెకండాఫ్‌లో రైతుల‌కు న్యాయం చేసే విధంగా పోరాడే స‌న్నివేశాల్లో స‌ప్త‌గిరి న‌ట‌న మెప్పిస్తుంది. ముఖ్యంగా కోర్టులో ఎమోష‌న‌ల్‌గా మాట్లాడే స‌న్నివేశం బావుంది. డ్యాన్సులు ప‌రంగా స‌ప్త‌గిరి మెప్పించాడు.ఇక రాజ్‌పాల్ అనే లాయ‌ర్ పాత్ర‌లో సాయికుమార్ న‌ట‌న అద్వితీయం. త‌న‌దైన టైమింగ్‌తో సాయికుమార్ పాత్ర‌లో ఒదిగిపోయారు. ఇక జ‌డ్జ్ పాత్ర‌లో న‌టించిన శివ‌ప్ర‌సాద్ కూడా చాలా చ‌క్క‌గా చేశారు. స‌ప్త‌గిరి సినిమాలో ఎంట‌ర్‌టైన్మెంట్ ఉంటుంది క‌దా అనుకునే ప్రేక్ష‌కుడికి ఆ రేంజ్ ఎంట‌ర్‌టైన్మెంట్ సినిమాలో క‌నిపించ‌దు. మొత్తంగా సినిమాలో సెకండాఫ్ సినిమారేంజ్‌ను పెంచేసింది.

Plus Points:

న‌టీన‌టుల ప‌నితీరు

నేప‌థ్య సంగీతం

సెకండాఫ్‌లో వ‌చ్చే కోర్టు సీన్‌

సినిమాటోగ్ర‌ఫీ

Minus Points:

ఎంట‌ర్‌టైన్మెంట్ కు స్కోప్ లేదు

ఫ‌స్టాఫ్ ప్ర‌థమార్థం వీక్‌గా అనిపిస్తుంది

Final Verdict:

న్యాయం కోసం పోరాడే.. ‘స‌ప్త‌గిరి ఎల్‌.ఎల్‌.బి’

Young Amaravati Rating: 3 / 5

Trailer:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here