విమానాల్లో తిరగాల్సిన వ్యక్తి హఠాత్తుగా రైలులో సాధారణ వ్యక్తిగా ప్రయాణిస్తుంటే తోటి ప్రయాణికుల్లో ఆసక్తితోపాటు అనుమానంకూడా కలుగుతుంది. ఇలాంటి సంఘటనే అంథేరి రైల్వే స్టేషన్‌లో జరిగింది. రైలులో ఓ బ్యాగు తగిలించుకొని ప్రయాణిస్తున్న అతడు చూడ్డానికి టీమిండియా పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌లా ఉన్నాడు. ఒకవేళ అతడు శార్దూల్‌ ఠాకూరే అయితే లోకల్‌ ట్రైన్‌లో ఎందుకు ప్రయాణిస్తాడు. ఇలాంటి సందేహాల ఎన్నో ట్రైన్‌లో ఉన్న కుర్రాళ్లకు వచ్చాయి చివరకు ధైర్యం చేసి అతడిని ‘నువ్వు భారత క్రికెటర్‌వా’ అని ప్రశ్నించి గూగూల్‌లో అతడి ఫొటోలను సరిచూసుకున్న తర్వాత తమతో ప్రయాణిస్తోంది శార్దూల్‌ ఠాకూరేనని ఖరారు చేసుకున్నారు.దక్షిణాఫ్రికాలో వన్డే, టీ20 సిరీస్‌ గెలిచిన భారత జట్టులోని సభ్యుడైన శార్దూల్‌ స్వదేశానికి రాగానే ఇంటికి చేరుకునేందుకు విమానాశ్రయం నుంచి అంథేరి రైల్వే స్టేషన్‌కు చేరుకుని లోకల్‌ ట్రైన్‌లో తన ఇంటికి వెళ్లిపోయాడు. గతంలో గంటన్నర ప్రయాణం చేసి గ్రౌండ్‌కు చేరుకుని జాతీయ స్థాయికి ఎదిగేలా కృషి చేసిన శార్దూల్‌ను రైల్వే స్టేషన్‌లో పని చేసేవారు ప్రసంశించారు. ఏదో ఒకరోజు భారత జట్టుకు ఈ కుర్రాడు ఆడితీరుతాడని గతంలోనే చెప్పామని వారు తెలిపారు. జాతీయ క్రికెటర్‌ అయినా నిరాడంబరంగా లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణించడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎంత ఎత్తుకు ఎదిగినా తాను మూలాలను మర్చిపోలేదని శార్దూల్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here