శ్రీయ అందం వెన‌క అస‌లు ర‌హ‌స్యం ఇదేనాట…!

0
29

బ్యూటీ విత్ బ్రెయిన్‌.. అందుకే అందాల శ్రీయ 15 ఏళ్ల సుదీర్ఘ ఇన్నింగ్స్‌లో ఏనాడూ వెనుదిరిగి చూసిందే లేదు. సౌత్‌లో అందివ‌చ్చిన అవ‌కాశాల్ని అందుకుంటూ కెరీర్ బండి న‌డిపిస్తోంది. ఇష్టం సినిమాతో ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన‌ప్పుడు ఎంత అందంగా ఉందో ఇప్ప‌టికీ అదే గ్లామ‌ర్ మెయింటెయిన్ చేస్తూ యువ‌త‌రంలో గుబులు పెంచుతూనే ఉంది. అయితే ఆ అందం వెన‌క అస‌లు ర‌హ‌స్యం ఏంటో తెలిసొచ్చిందిలా.

ఇదిగో ఇక్క‌డ డీప్ వాట‌ర్‌లో శ్రీయ ఇంత నిబ్బ‌రంగా ఊపిరి పీల్చ‌కుండా ఎలా ధ్యానం చేస్తుందో చూడండి అలా చేయాలంటే ఎన్ని గుండెలు ఉండాలి. చేప పిల్ల తాకితేనో.. మోకాళ్ల లోతు నీటిలో దిగేందుకే భ‌య‌ప‌డే మ‌గువ‌లు ఉన్నారు. కానీ శ్రీయ ధీర‌త్వం చూస్తుంటే ముచ్చ‌ట‌ప‌డ‌కుండా ఉండ‌లేం. 10 అడుగుల లోతులో నీటి అడుగున త‌న‌ని ఇలా ఛాయాచిత్రంలోకి చిత్రించింది డీప్ వాట‌ర్ ఫోటోగ్రాఫ‌ర్ అనూప్‌. ప్ర‌స్తుం ఈ ఫోటో సామాజిక మాధ్య‌మాల్లో వేగంగా వైర‌ల్ అయిపోతోంది. శ్రీయ స్వ‌యంగా ఫ్యాన్స్‌కి షేర్ చేసింది. ఈత కొట్ట‌డం, స్విమ్ షూట్‌లో క‌నిపించ‌డం శ్రీయ‌కు కొత్త కాదు. అందుకే ఇంత ధైర్యంగా ఈ ఫీట్ వేసింద‌న్న‌మాట‌!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here