శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ జాన్వి లేఖ‘నువ్వు గర్వపడేలా చేస్తా అమ్మా’

1
256

తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన అతిలోక సుందరి శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ ఆమె పెద్ద కుమార్తె జాన్వి కపూర్‌ లేఖ రాశారు. బరువెక్కిన గుండెతో తల్లే తన ప్రపంచం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా హృదయంలో తీరని లోటు ఒకటి ఏర్పడింది. దాంతో ఎలా జీవించాలన్న విషయాన్ని నేర్చుకోవాలి. ఇంతలోటు ఉన్నప్పటికీ ఇంకా నేను నీ (శ్రీదేవి) ప్రేమ అనుభూతిని పొందుతున్నాను. నువ్వు నన్ను బాధ నుంచి, నొప్పి నుంచి సంరక్షిస్తున్నట్లే అనిపిస్తోంది. నేను కళ్లు మూసిన ప్రతిసారి.. గుర్తు చేసుకోవడానికి కేవలం మంచి అనుభూతులే ఉన్నాయి. ఇలా చేసింది నువ్వే అని నాకు తెలుసు’.

‘మా జీవితాల్లోకి నువ్వు రావడం నిజంగా మా అదృష్టం. నువ్వు చాలా మంచిదానివి, చాలా స్వచ్ఛమైన వ్యక్తివి, ప్రేమమూర్తివి. అందుకే దేవుడు నిన్ను తిరిగి తీసుకెళ్లిపోయాడు. నా స్నేహితులు ఎప్పుడూ ‘నువ్వు హ్యాపీగా ఉంటావు’ అంటుండేవారు. ఆ సంతోషానికి కారణం నువ్వేనని నాకు ఇప్పుడు అర్థమైంది’.

‘నేను ఎవరు ఏమన్నా పట్టించుకోలేదు.. ఏదీ సమస్యగా అనిపించలేదు, ఈ రోజు బాలేదని ఎప్పుడూ అనిపించలేదు.. ఎందుకంటే అప్పుడు నాకు నువ్వు ఉన్నావు కాబట్టి. నువ్వు నన్ను చాలా ప్రేమించావు. నేను ఎవరిపైనా ఆధారపడలేదు.. ఎందుకంటే నాకు కావాల్సిన ఒకేఒక్క వ్యక్తివి నువ్వు’.

‘నా జీవితంలో నువ్వు ఓ భాగం. నా ప్రాణ స్నేహితురాలివి. నీ జీవితాన్ని మొత్తం ఇచ్చేశావు. ఇప్పుడు నీ కోసం అదే చేయాలి అనుకుంటున్నా అమ్మా. నువ్వు గర్వపడేలా చేస్తాను. నిన్ను చూసి నేను ఎంత గర్వపడ్డానో.. అదే స్థాయిలో నన్ను చూసి నువ్వు గర్వపడే రోజు వస్తుందని ఆశిస్తూ పనిచేస్తా. ఇదే ఆలోచనతో ప్రతిరోజు నిద్రలేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా. ఎందుకంటే నువ్వు ఇక్కడే ఉన్నావు.. దాన్ని నేను అనుభూతి చెందుతున్నా. నువ్వు నాలో, ఖుషిలో, నాన్నలో నిండి ఉన్నావు. నువ్వు మాపై వేసిన ముద్ర (చూపిన ప్రభావం) చాలా బలమైనది. మేము జీవించడానికి అది చాలు.. కానీ నీ లోటును తీర్చడానికి మాత్రం అది సరిపోదు’ అని జాన్వి లేఖలో పేర్కొన్నారు. ‘ఐ లవ్‌ యూ మై ఎవ్రీథింగ్‌’ అంటూ ముగించారు. దీంతోపాటు ఫ్యామిలీ ఆల్బమ్‌లోని కొన్ని ఫొటోలను పంచుకున్నారు.

1 COMMENT

  1. ప్రస్తుత సమాజంలో చీకటి మాటున జరిగే అరాచకాలకు సాక్షిగా నిలుస్తున్న రాత్రి పూట స్వేచ్ఛగా తిరగాలనుంది అంటూ జ్యోత్స్న, అమావసను వెన్నెలగా మలిచే నిషిద్ధ స్వప్నాల సాగు చేయమంటూ తరంగాల ప్రసారం చేస్తున్న నిశిరాత్రి అంటూ శాంతి ప్రబోధ, ధైర్యాన్ని, చెలిమిని ఇచ్చే రాత్రికి నాకు తీరని అనుబంధం అంటూ అరుణ, చావు పుట్టుకలు లేని కాలం పాడే మౌన రాగంలో ఆ రాత్రి… అక్కడ… అంటూ బండారు విజయ, ప్రతి రాత్రికీ నడుమ జీవ స్పందనను కల్పించే రాత్రి పట్ల నాకు వ్యామోహం అంటూ సుహాసిని, చల్లగా మెల్లగా ఉన్నానంటూ ఎందర్నో దగా చేస్తూ, ఏమీ తెలియని నంగనాచిలా రాత్రి ఎన్నో విధాలుగా గుచ్చుకుంటుంది అంటూ సమ్మెట విజయ, నిద్రపోతున్న నగరంలో రాత్రి జీవన చిత్రం దుఃఖాన్ని మించిన దుఃఖాన్నిఓదారుస్తుందంటూ రేణుక, నిద్రని జార్చేసిన కను రెప్పల నీలి నీడల్లో రేకెత్తిన ఆలోచనలు నాలోకి, లోలోకి కొనసాగుతున్న ప్రయాణం బాధల తేనెటీగలను ఝుమ్మనిపించటంతో పాటు చిరు జ్ఞాపకాల కాగడా పరచిన వెలుగులో రాత్రి దుప్పటిని విదిలించుకుని వెలుతురు పిట్టనై సాగిపోతున్నానంటూ సుభద్రా దేవి, నేను కూడా రాత్రి కురిసే వానలాంటి దాన్నే నంటూ భవాని, నేరాల ఘోరాలే కాదు శరత్చంద్రికల విలాసాలు కూడా రాత్రి బహురూపాలేనంటూ జ్వలిత, ప్రకృతి ప్రసవ వేదన, సామాజిక సంఘర్షణ ఏదైనా ఈ రాత్రిలోనే అంటూ జ్యోతి, ఆలోచన అంకురాన నాటుకునే కల చేను, పగటి మలినాలను వడబోసే శుద్ధ కర్మాగారం రాత్రి అంటూ ఉషా రాణి,  వానను వెన్నంటి ఉన్న బురద లాగానే సమాజం వేసిన సంకెలలు మాటున దాగిన మంచితనపు ఆత్మ గౌరవం తడవకొక తులం చొప్పున బలి అయిపోతుందంటూ నిర్మల, రాత్రికి ఆవల…అచేతన మనసులకు, సజీవ శరీరాల గాధలకు మౌన సాక్షి ఈ రాత్రి అంటూ సత్యవాణి, సంక్రాంతి సెలవుల నాటి రాత్రిలో అమ్మా నాన్నల బ్రతుకు సంఘర్షణ చిత్రాన్ని పలికిస్తూ జరీనా కవితా పఠనాన్ని ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here