రంగస్థలంలో రాజకీయం – ఇదో రాజకీయ రంగస్థలం

0
58

సుకుమార్‌ శైలి విభిన్నం. ఫక్తు కమర్షియల్‌ కథల్ని అస్సలు పట్టించుకోడు. తనదైన ‘ఫార్ములా’నే నమ్ముకుంటాడు. లాజిక్కులతో మ్యాజిక్‌ చేస్తాడు. అంకెలతో గారడీ సృష్టిస్తాడు. ‘100 % లవ్‌’, ‘వన్‌’, ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. మరి ‘రంగస్థలం’ ఎలాంటి కథ..? ఇందులోనూ అలాంటి లాజిక్కుల మ్యాజిక్కులే ఉంటాయా? అని అడిగితే… ‘ఇదో రాజకీయ రంగస్థలం’ అనే సమాధానం దొరుకుతుంది. అవును.. ఇదో పొలిటికల్‌ డ్రామా అని సమాచారం. థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉంటాయట.

1985లో ‘రంగస్థలం’ అనే ఓ పల్లెటూరిలో జరిగిన ఓ రాజకీయ చదరంగం ఈ ‘రంగస్థలం’. చిట్టిబాబుగా రామ్‌చరణ్‌ నటించాడు. అతనో సౌండ్‌ ఇంజనీర్‌. అన్నగా ఆది నటించాడు. తన పాత్ర ఈ కథలో చాలా కీలకం. జగపతిబాబు మరో ప్రధాన పాత్రధారి. రామలక్ష్మిగా సమంత కనిపించబోతోంది.ఇప్పటికే మూడు పాటలు విడుదలయ్యాయి. మూడూ.. మూడు రకాలుగా సాగాయి. ‘ఎంత సక్కగున్నావే’ కవితాత్మక గీతం. రామలక్ష్మి అందాల్ని వర్ణిస్తూ సాగిన పాట అది. ‘రంగ రంగ రంగస్థలాన’… జాతర పాట. పూర్తి ఫోక్‌ శైలిలో సాగిన గీతమిది. మూడో పాట ‘రంగమ్మ మంగమ్మ’. అబ్బాయి గురించి అమ్మాయి పాడుకునే పాట. మరో రెండు పాటలు ‘రంగస్థలం’ నుంచి విడుదల అవుతాయి. ఈనెల 29న ‘రంగస్థలం’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈలోగా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ ఏర్పాటు చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here