భార్య ప్రాణాలు తీసిన ‘వాట్సప్’ వేళాకోళం..!

0
29

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పట్టణంలో ఒక వైద్యుని భార్య విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్న ఉదంతం వెలుగు చూసింది. భర్త.. ఆమెను వేళాకోళం చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. పట్టణానికి చెందిన స్కిన్‌స్పెషలిస్ట్ డాక్టర్ నలిన్ పాట్నీఒక క్లినిక్ నిర్వహిస్తున్నారు. అతని భార్య.. దంత సమస్యలతో బాధపడుతోంది. దీంతో ఆయన తన భార్య సోనాను తనకు తెలిసిన వైద్యుని దగ్గరకు చికిత్స కోసం తీసుకువెళ్లాడు. అక్కడ దంత వైద్యుడు ఆమెకు ఉన్న ముందు పన్ను పాడైందని, దానిని తొలగించి కొత్త పన్నును అమర్చాల్సి ఉంటుందని చెప్పాడు. దీంతో తరువాత చికిత్స చేయించుకుంటామని చెప్పి వారు వచ్చేశారు.

ఆ తరువాత డాక్టర్ నలిన్ తన భార్య సోనాను వేళాకోళం చేస్తూ.. నీకు ముందు పన్ను తొలగించిన రోజు నీ ఫొటో వాట్సప్‌లో పెడతానన్నాడు. అలాగే దానికింద ‘నా భార్య ముసలిదైపోయింది, ఆమె పళ్లు ఊడిపోయాయని’ కామెంట్ రాస్తానని చెప్పాడు. ఈ మాట వినగానే సోనా గదిలోకి వెళ్లిపోయి, కొద్ది సేపటి తరువాత బయటకు వచ్చి.. నేను విషం తాగేశానని చెప్పింది. దీంతో డాక్టర్ నలిన్ కంగుతిన్నాడు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here