`అవ‌తార్ 2` ఆర్ట్ డైరెక్ట‌ర్ మ‌న తెలుగ‌మ్మాయి అమ్మాయే…!

0
33

ఒక తెలుగ‌మ్మాయి `అవ‌తార్‌-2`కి క‌ళాద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారా? అంటే అవుననే స‌మాచారం. అవును ఇది షాక్‌నిచ్చే విష‌య‌మే. ఒక తెలుగ‌మ్మాయి, గ్రామీణ యువ‌తి ఏకంగా హాలీవుడ్‌కి వెళ్లి అక్క‌డ ఏకంగా జేమ్స్ కామెరూన్ తెర‌కెక్కిస్తున్న `అవ‌తార్ 2`కి ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేస్తున్నారంటే విస్మ‌యాన్ని క‌లిగించే వార్త‌నే. అంత‌కుమించి అది ఎంతో స్ఫూర్తిని ర‌గిలించే విష‌యం. అస‌లింత‌కీ ఎవ‌రీ అమ్మాయి అంటే ..?

పేరు అశ్రిత‌ కామ‌త్‌. ఆంధ్రా గాళ్‌. ప్ర‌తిష్టాత్మ‌క అమెరిక‌న్ ఫిలింఇనిస్టిట్యూట్ క‌న్జ‌ర్వేట‌రీలో ప్రొడ‌క్ష‌న్ డిజైన్ కోర్సులో ఎంఎఫ్ఏ పూర్తి చేశారు. తాను ఇనిస్టిట్యూట్‌లో స‌మ‌ర్పించిన తొలి థీసిస్ `ఇంటెర్‌స్టేట్‌` 41వ స్టూడెంట్ అకాడెమీ పుర‌స్కారాల్లో బ్రాంజ్ మెడ‌ల్ ద‌క్కించుకుంది. ఇక రెండో థీసిస్ `ద‌స్త్‌ల్యాండ్` బెస్ట్ ప్రొడ‌క్ష‌న్‌, ఆర్ట్ డిజైన్ విభిగంలో ఫిల్మ్ క్వెస్ట్‌కి నామినేట్ అయ్యింది. అశ్రిత త‌ల్లి గ్రాఫిక్ డిజైన‌ర్‌. మ‌మ్మీనే త‌న‌కు తొలి అధ్యాప‌కురాలు. ఇక ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌లో శిక్ష‌ణ పూర్త‌య్యాక అశ్రిత ప‌లు బాలీవుడ్, హాలీవుడ్‌ సినిమాల‌కు ప‌ని చేశారు.బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ `జింద‌గీ న మిలేగా దొబారా` చిత్రానికి ప‌ని చేశారు. అలాగే హాలీవుడ్‌లో `కాంగ్- స్క‌ల్ ఐల్యాండ్‌`, ప‌సిపిక్ రిమ్, ది బిఎఫ్‌జి వంటి చిత్రాల‌కు ప‌ని చేశారు. స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్, జేమ్స్ కామెరూన్ అంత‌టి వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ డైరెక్ట‌ర్స్‌తో మ‌న తెలుగ‌మ్మాయి కీల‌క‌మైన క‌ళా దర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయ‌డం అంటే ఆషామాషీనా? హ‌్యాట్సాఫ్ టు అశ్రిత‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here