సోషల్‌మీడియాలో దర్శనమిస్తున్న వీడియోను చూస్తే మాత్రం టెక్నాలజీని ఇలా కూడా ఉపయోగించుకోవచ్చా? అని మీరు ఆశ్చర్యపోతారు.

0
29

జూనియర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన ‘నాన్నకు ప్రేమతో’లో ‘ఫాలో ఫాలో..’ పాట గుర్తుందా..? అందులో తారక్‌ హోవ‌ర్‌ బోర్డుపై ఎంట్రీ ఇస్తూ సందడి చేస్తాడు. మన దేశంలోఇది ఇంకా విరివిగా వినియోగంలోకి రానప్పటికీ విదేశాల్లో మాత్రం వీటిని బాగానే వినియోగిస్తున్నారు. ఎక్కువ దూరం నడవాల్సి వచ్చినప్పుడు వీటిపై సులువుగా వెళ్లిపోవచ్చు. వీటిల్లో పలు రకాల మోడళ్లు సైతం వచ్చేశాయి.

అయితే, తాజాగా సోషల్‌మీడియాలో దర్శనమిస్తున్న ఓ వీడియోను చూస్తే మాత్రం టెక్నాలజీని ఇలా కూడా ఉపయోగించుకోవచ్చా? అని మీరు ఆశ్చర్యపోతారు. నటి మంచు లక్ష్మీ ప్రసన్న ఈ వీడియోను తన ట్విటర్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ఈ వీడియోలో ఓ మహిళ హోవర్డ్‌ బోర్డుపై ఇంటి ముందు చీపురుతో శుభ్రం చేస్తూ కన్పిస్తున్నారు. సాంకేతికతను అద్భుతంగా వినియోగించుకున్నారని కామెంట్‌ చేస్తూ మంచు లక్ష్మి ట్వీట్‌ చేశారు. భారత్‌ ముందుకెళ్తొందంటూ సరదాగా హ్యాష్‌టాగ్‌నూ జత చేశారు. ఆ వీడియో మీ కోసం..


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here