భార్యాభర్తల ప్రేమకి మంచి కథ..!!కుటుంబ విలువలు బతికేఉంటాయి అని చెప్పడానికే ఈ చిన్న కథ.

0
32


ఒక భార్యాభర్తలు ప్రతిరోజు పోట్లాడుకుంటూనే ఉంటారు చిన్న సంపాదనపరుడైన తన భర్తని పక్కనోళ్లు అది కొన్నారు, ఎదిరింటోళ్లు ఇది కొన్నారు, వెనకింటోళ్లు ఇది కొన్నారు అని భార్య ప్రతిరోజు ఏదో ఒక కోరిక కోరుకుంటూనే ఉంటుంది.

భార్య ఏది అడిగిన భర్త ఎన్నోసార్లు సర్ది చెప్పాడు, “నేను ఒక సాదా సీదా వాడిని, నువ్వు అడిగే అంతపెద్ద ఏ కోరికలు తీర్చలేను మనకున్నంతలో సర్దుకుపోదాం” అని అన్నప్పుడల్లా తనకి మాత్రమే. ఇలాంటి భర్త దొరికడు అనుకునేది భార్య.

ఇలా చాలా రోజులు గడిచాక ఒకరోజు ఇద్దరు కలిసి తన కుటుంబంలో చుట్టాల పెళ్ళికి వెళ్లారు, అక్కడ పెళ్ళిలో ఒక సరదాగా ఒక ఆట పెట్టారు గెలిచినా దంపతులకి 20 వేల రూపాయలు బహుమతి ఇస్తా అన్నారు, వీళ్ళను కూడా అందులో పాల్గొనమని చుట్టాలు బతిమాలడంతో సరే అన్నారు, అప్పటికే భార్య పెళ్ళికి వచ్చేముందు పట్టుచీర కట్టుకొని పోకపోతే పరువుపోతుందని భర్తని తిట్లు తిట్టి చేసేదేమిలేక ఇష్టం లేకపోయినా పెళ్లికొచ్చింది.ఆట మొదలయింది… ఒక కుర్చీ వేశారు ఆ తర్వాత ఒక దానిమీదొకటి వేస్తారు అలా ప్రతి కుర్చీమీద భార్యని ఎత్తుకొని అందులో భర్త కూర్చోపెట్టాలి మళ్ళీ కుర్చీలోంచి ఎత్తుకొని దింపాలి అదే ఆట.

రెండో కుర్చీ మొదటి కుర్చీ మీద వేశారు భార్యని కూర్చోపెట్టాడు,
మూడోది వేశారు కూర్చోపెట్టాడు దింపాడు,
నాలుగు వేశారు కూర్చోపెట్టాడు దింపాడు,
ఐదవది వేశారు కూర్చోపెట్టాడు దింపాడు,
ఆరవది వేశారు కూర్చోపెట్టాడు దింపాడు,
ఏడువది వేశారు కూర్చోపెట్టాడు దింపాడు,
ఎనిమిదవది వేశారు కూర్చోపెట్టాడు దింపాడు,
తొమ్మిదవది వేశారు కూర్చోపెట్టాడు దింపాడు,

పదవది వేశారు బాగా ఎత్తుగా ఉంది అయినా సరే కొంచెం కష్టంగా ఉన్న అంత పైకి ఎత్తుకొని కూర్చోపెట్టాడు దింపాడు,
పదకొండు, పన్నెండు, పదమూడు ఇలా కుర్చీలు పెరుగుతున్నాయి అయినా భర్త ఆపట్లేదు ఒక్కసారి భర్త వైపు భార్య చూసింది, భర్త కళ్ళల్లో కన్నీళ్లు చూసింది, ఎంత నొప్పిని భరిస్తున్నాడో తనకి కనిపించింది, ఆ నొప్పిని భరించేది ఆయన గెలవాలని కాదు కనీసం ఇలా అయినా భార్య అడిగిన కోరిక తీర్చాలని భర్త పడే కష్టం ఆ భార్యకు తెలిసింది.

“భర్తను అర్ధం చేసుకునే భార్యలు చాలామంది ఉంటారు, కానీ వాళ్ళల్లో నేను లేనని ఇప్పుడే తెలిసింది, భార్యని అర్ధం చేసుకునేవాళ్ళు అతి కొద్ది మందే ఉంటారు, అందులో నా భర్త ఉన్నాడని ఆయన కళ్ళల్లోకి చూసాకే తెలిసింది”

ఆ కళ్ళను చూసి తన కళ్ళు కూడా ఏడవడం మొదలెట్టాయి…ఆట ముగిసింది, 20వేల రూపాయలు వీళ్లకందిస్తూ, ఈ ఆటలో గెలుపు ఓటములు అంటూ ఉండవు
“భార్య వుంటే ప్రతి భర్త గెలుస్తాడు, భర్త ఉంటే ప్రతి భార్య గెలుస్తుంది, ఇద్దరు గెలిస్తే వాళ్ళ మధ్యన ప్రేమ కూడా గెలుస్తుంది,”

అలాంటి ప్రేమను గుండెలో దాచుకొని పైకి చూపించలేని, పైకి కనిపించకుండా దాచుకొని ఎంతో మంది భార్యాభర్తలు తమ ప్రేమకి అన్యాయం చేసుకుంటున్నారు, కనీసం ఇలాంటి ఆటల వళ్ళైనా ఆ ప్రేమను బైటికి తెప్పించే వేదిక అయినందుకు చాలా సంతోషంగా ఉంది అని నిర్వాహకులు ప్రకటించారు.

కానీ ఆ భార్య ఆ డబ్బులు తీసుకోలేదు, “ఏ డబ్బుల కోసం నా భర్తని బాధపెట్టానో, ఇప్పుడదే డబ్బు వల్ల నా భర్త విలువ తెల్సింది, ఈరోజే తెలిసింది అలాంటి భర్తను పొందడం నా అదృష్టం”అని.

ఆరోజు నుండి వాళ్ళిద్దరిమధ్య చిన్న చిన్న గొడవలు తప్ప,నాకిది కావాలి, నాకు అది కావాలని భార్య అడగలేదు. అక్కడ ఒక సంసారం నిలబడింది, కుటుంబంలో ప్రేమ నిలబడింది కుటుంబ విలువలు బతికేఉంటాయి అని చెప్పడానికే ఈ చిన్న కథ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here